మహర్షి మల్లగుల్లాలు స్టార్ట్

పెద్ద సినిమా విడుదలవుతోంది. అందులోనూ ముగ్గురు భాగస్వాములు అంటే, వ్యవహారం ఓ లెక్కలో వుంటుంది. మహర్షి సినిమాకు ఇప్పుడు ఇదే ఇబ్బందిగా మారుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో అశ్వనీదత్, పివిపి, దిల్ రాజు భాగస్వాములు.…

పెద్ద సినిమా విడుదలవుతోంది. అందులోనూ ముగ్గురు భాగస్వాములు అంటే, వ్యవహారం ఓ లెక్కలో వుంటుంది. మహర్షి సినిమాకు ఇప్పుడు ఇదే ఇబ్బందిగా మారుతోందని తెలుస్తోంది. ఈ సినిమాలో అశ్వనీదత్, పివిపి, దిల్ రాజు భాగస్వాములు. అశ్వనీదత్ లేటెస్ట్ మూవీ దేవదాస్ కు కొన్ని బకాయిలు వున్నట్లు తెలుస్తోంది.

దేవదాస్ నైజాం డిస్ట్రిబ్యూటర్ సునీల్ కు అశ్వనీదత్ మధ్య 1.60 కోట్ల పంచాయతీ వుందని తెలుస్తోంది. దీని గురించి అడిగితే, మహర్షి సినిమాకు భయంకరంగా ఖర్చయిపోయిందని, ఇప్పటికే లాభంలేదని, ఇప్పుడు ఈ 1.60 కోట్లు అందులో చేరిస్తే నష్టం తప్పదని నిర్మాతల్లో ఒకరైన దిల్ రాజు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

దాంతో సునీల్ ఈ విషయమై చాంబర్ కు ఫిర్యాదు చేసే ప్రయత్నాలు చేసినట్లు, దాంతో అశ్వనీదత్ కుమార్తె స్వప్నదత్ కలుగచేసుకుని, తాను సెటిల్ చేస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే మహర్షి లావాదేవీల విషయంలో పివిపి, దిల్ రాజు ఒకవైపు, అశ్వనీదత్ మరోవైపు అయినట్లు, అశ్వనీదత్ ను దూరం పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంలో అశ్వనీదత్ కొందరు పెద్ద మనుషుల జోక్యం కోరినట్లు, కానీ వారు నిరాకరించినట్లు తెలుస్తోంది. ఇదే క్రమంలో ఒకరిద్దరు లాయర్ల దగ్గరకు కూడా వెళ్లినట్లు బోగట్టా. ఆఖరికి వారిలో వారే ముగ్గురు కూర్చుని, మాట్లాడుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఈ మేరకు నేడో, రేపో ముగ్గురు కూర్చుని ప్రొడక్షన్ కు ఇంత ఓవర్ కాస్ట్ ఎందుకు అయింది, మహేష్ లాంటి సూపర్ స్టార్ తో సినిమా నిర్మించి, 150 కోట్ల మేరకు అన్ని రకాలుగా మార్కెట్ చేస్తే, అస్సలు లాభంలేని పరిస్థితి ఎందుకు తలెత్తింది అన్నది చర్చించుకుంటారని తెలుస్తోంది.

ఆ మూడు లోక్ సభ స్థానాల్లో భారీగా క్రాస్ ఓటింగ్!