మహేష్ బాబు సినిమా అంటే మూడు అక్షరాల పేరు పక్కా అని టాక్ వుంది. భరత్ అనే నేను సినిమాతో అది బ్రేక్ అయింది. కానీ మహర్షి మళ్లీ మూడు అక్షరాల పేరే. డిజాస్టర్ స్పైడర్ కు మూడు అక్షరాలే. బ్రహ్మోత్సవంకు కాదు. అందువల్ల సెంటిమెంట్ వర్క్ అవుట్ అయింది అనుకోవడానికి లేదు.
అందుకే ఈసారి కూడా సెంటిమెంట్ బ్రేక్ చేసి 'సరిలేరు నీకెవ్వరూ' అనే టైటిల్ పెట్టాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. దర్శకుడు అనిల్ రావిపూడి మూడునెలల క్రితం తన స్క్రిప్ట్ కు ఈ టైటిల్ పెట్టుకున్నారు. కానీ మహేష్ కు ఇంకా చెప్పలేదు.
అనిల్ రావిపూడికి ఇంగ్లీష్ టైటిళ్లే అచ్చివచ్చాయి ఇప్పటివరకు. ఫస్ట్ టైమ్ ఆయన కూడా ఫర్ ఏ ఛేంజ్ తెలుగు టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. అందుకే 'సరిలేరు నీకెవ్వరూ' అనే మహేదేవన్ సూపర్ హిట్ సాంగ్ ను గుర్తుచేసే టైటిల్ ను తీసుకున్నారు.
కానీ మహేష్ బాబు అప్రూవల్ కోసం వెయిటింగ్. అదివస్తే, ఇదే టైటిల్. లేదూ అప్రూవల్ రాకపోతే వేరే టైటిల్. మళ్లీ మహేష్ సెంటిమెంట్ మూడు అక్షరాలు, అనిల్ రావిపూడి సెంటిమెంట్ ఇంగ్లీష్ పదాలు రంగంలోకి వస్తాయి.