మళ్లీ అదే రూట్‌లోకి బాలకృష్ణ

'ఎన్టీఆర్‌' బయోపిక్‌ తర్వాత రెగ్యులర్‌గా చేసే మాస్‌ చిత్రాలకి స్వస్తి చెప్పి కథాబలమున్న చిత్రాలు చేయాలని బాలకృష్ణ భావించారు. కానీ 'ఎన్టీఆర్‌' చిత్రాలని దారుణంగా తిప్పికొట్టడంతో బాలకృష్ణ ఎప్పటిలా ఫైట్‌, సాంగ్‌, పంచ్‌ డైలాగ్‌…

'ఎన్టీఆర్‌' బయోపిక్‌ తర్వాత రెగ్యులర్‌గా చేసే మాస్‌ చిత్రాలకి స్వస్తి చెప్పి కథాబలమున్న చిత్రాలు చేయాలని బాలకృష్ణ భావించారు. కానీ 'ఎన్టీఆర్‌' చిత్రాలని దారుణంగా తిప్పికొట్టడంతో బాలకృష్ణ ఎప్పటిలా ఫైట్‌, సాంగ్‌, పంచ్‌ డైలాగ్‌ థీమ్‌లోనే సినిమాలు చేయాలని చూస్తున్నారు. ఎలాంటి కొత్తదనం లేని 'జై సింహా' చిత్రం సంక్రాంతికి విడుదలయి సాధించిన వసూళ్లని 'ఎన్టీఆర్‌' రెండు భాగాలుగా వచ్చి కూడా సాధించలేకపోవడంతో బాలయ్య ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఎన్టీఆర్‌ రెండు భాగాలు విడుదలైన తర్వాత రాజకీయ ప్రచారం కోసం బ్రేక్‌ తీసుకున్న బాలకృష్ణ ఆ సమయంలో ఫాన్స్‌ సపోర్ట్‌, సింపతీ కాకుండా ఆగ్రహాన్ని చూరగొన్నారు. పలుమార్లు అభిమానులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, జర్నలిస్టులపై చేయి చేసుకుని వార్తల్లో నిలిచారు. ఎన్నికల రోజున బాలకృష్ణపై పెల్లుబికిన ప్రజాగ్రహాన్ని టీడీపీ అనుకూల మీడియా హైలైట్‌ చేయలేదు కానీ ఫాన్స్‌లోను నిరసనలయితే తారాస్థాయిలో వున్నాయిపుడు.

ఈ నేపథ్యంలో ప్రయోగాలకి వెళ్లడం కంటే తనకి గ్యారెంటీ మార్కెట్‌ తెచ్చే చిత్రాలు చేయాలని డాలయ్య డిసైడ్‌ అయ్యారు. అందుకే 'జై సింహా'లాంటి నాసి రకం సినిమా తీసిన కె.ఎస్‌. రవికుమార్‌తో మరో చిత్రం చేయడానికి అంగీకరించారు. ఎన్టీఆర్‌ బయోపిక్‌ని అభిమానులు కూడా అంత దారుణంగా తిరస్కరించిన నేపథ్యంలో ఇకపై ఆయన చిత్రాలకి ఎలాంటి ఆదరణ లభిస్తుందనేది ఆసక్తిగా చూస్తున్నాయి ట్రేడ్‌ వర్గాలు. 

ఆ మూడు లోక్ సభ స్థానాల్లో భారీగా క్రాస్ ఓటింగ్!