అందుకే ర‌కుల్ సింగిల్ గా ఉంద‌ట‌!

త‌న గురించి ఎవ‌రేమ‌నుకున్నా.. త‌ను సింగిల్ గానే ఉన్న‌ట్టుగా స్ప‌ష్టం చేస్తోంది ర‌కుల్ ప్రీత్ సింగ్. ఈ పంజాబీ భామ విష‌యంలో ప‌లు రూమ‌ర్లు ఇది వ‌ర‌కే వ‌చ్చాయి. తెలుగులో ఈమె కెరీర్ పీక్స్…

త‌న గురించి ఎవ‌రేమ‌నుకున్నా.. త‌ను సింగిల్ గానే ఉన్న‌ట్టుగా స్ప‌ష్టం చేస్తోంది ర‌కుల్ ప్రీత్ సింగ్. ఈ పంజాబీ భామ విష‌యంలో ప‌లు రూమ‌ర్లు ఇది వ‌ర‌కే వ‌చ్చాయి. తెలుగులో ఈమె కెరీర్ పీక్స్ లో ఉన్న స‌మ‌యంలోనే ర‌కుల్ గురించి ప‌లు రూమ‌ర్లు వ‌చ్చాయి. అయితే ర‌కుల్ వాటిని ధ్రువీక‌రించ‌లేదు. ఆ త‌ర్వాత స‌ద‌రు వ్య‌క్తుల‌తోనూ స‌న్నిహితంగా మెల‌గ‌లేదు. ప్ర‌త్యేకించి ర‌కుల్ మీద ప‌లు రూమ‌ర్లు వ‌చ్చినా,  ఆ వ్య‌క్తుల‌తో ఈమె క‌లిసి క‌నిపించింది లేదు. 

అలా ర‌కుల్ సింగిల్ అనిపించుకుంది, ఇక ఇప్పుడు ఈమె కెరీర్ ముందంత ఊపు మీద కూడా లేదు. ఈ క్ర‌మంలో ర‌కుల్ గురించి అలాంటి రూమ‌ర్లు కూడా త‌గ్గిపోయాయి. ఇలాంటి నేప‌థ్యంలో ర‌కుల్ త‌ను సింగ్ అంటూ స్ప‌ష్టం చేసింది. త‌ను సింగిల్ గా ఉండిపోవ‌డానికి కార‌ణం ఒక ర‌కంగా త‌న సోద‌రుడు అమ‌న్ సింగ్ కార‌ణ‌మ‌ని ఈ హీరోయిన్ త‌న తాజా ఇంట‌ర్వ్యూలో చెప్పుకొచ్చింది.

స్కూల్ రోజుల నుంచినే అత‌డు త‌న‌ను ఒక గూఢ‌చారిలా ఫాలో అయ్యేవాడ‌ని ర‌కుల్ చెప్పింది. త‌ను స్కూల్ లో ఎవ‌రైనా అబ్బాయిల‌తో మాట్లాడినా, వెంట‌నే  వ‌చ్చి ఇంట్లో చెప్పేసేవాడ‌ని, ఏదైనా అవ‌స‌రం కొద్దీ త‌ను ఎవ‌రితో మాట్లాడాల‌న్నా త‌న సోద‌రుడు ఇంట్లో చెబుతాడేమో అని భ‌య‌ప‌డాల్సి వ‌చ్చేద‌న్న‌ట్టుగా రకుల్ వివ‌రించింది. త‌న మీద అలా ఉన్న‌వీ లేనివీ చెబుతాడ‌ని త‌ను అబ్బాయిల‌కు పూర్తిగా దూరంగా ఉండేదాన్నంటూ ర‌కుల్ వివ‌రించింది. 

అలా అబ్బాయిల‌కు దూరంగా ఉండ‌టం అల‌వాటు అయిపోయింద‌ని, అందుకే ఇప్ప‌టికీ త‌ను సింగిల్ గా మిగిలిపోయిన‌ట్టుగా ఈ హీరోయిన్ చెబుతూ ఉంది. ర‌కుల్ చెప్పింది క‌న్వీన్సింగా ఉందా?

బన్నీ బర్త్ డే గిఫ్ట్ అదిరిందిగా