ఎక్స్ క్లూజివ్ – వెంకటేష్ కు రే చీకటి

విక్టరీ వెంకటేష్ కు రే చీకటి. అవును. అయినా అభిమానులు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇదంతా ఊ..ఉత్తుత్తినే..సినిమా కోసం. ఎఫ్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి-నిర్మాత దిల్…

విక్టరీ వెంకటేష్ కు రే చీకటి. అవును. అయినా అభిమానులు టెన్షన్ పడాల్సిన పని లేదు. ఇదంతా ఊ..ఉత్తుత్తినే..సినిమా కోసం. ఎఫ్ 2 సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు అనిల్ రావిపూడి-నిర్మాత దిల్ రాజు కలిసి చేస్తున్న మరో ప్రయత్నం ఎఫ్ 3. 

ఈ సినిమా కోసం విభిన్నమైన క్యారెక్టర్లు రాసుకున్నారు దర్శకుడు. ఫన్..ఫ్రస్టేషన్..ఫార్ట్యూన్ అంటూ డబ్బు చుట్టూ తిరిగే ఈ కథలో హీరో వెంకీ కి రే చీకటి వుంటుందట. ఇప్పటికే చిత్రీకరించిన ఈ రే చీకటి సీన్లు అవుట్ అండ్ అవుట్ ఫన్ తో వుంటాయని తెలుస్తోంది. 

గతంలో రవితేజను బ్లయిండ్ గా చూపించి, ఫన్…యాక్షన్ రెండూ పండించాడు అనిల్. ఈసారి వెంకీకి రే చీకటి యాడ్ చేసారు. 

గతంలో ఓసారి బ్రహ్మానందం చంటి సినిమాలో రే చీకటి క్యారెక్టర్ ను సూపర్ గా చేసారు. ఆ సినిమాలో వెంకీనే హీరో.  ఇప్పుడు వెంకీనే అలాంటి క్యారెక్టర్ చేయడం విశేషం. ఆ మధ్యన వెన్నెలకిషోర్ కూడా ఆనందో బ్రహ్మ సినిమాలో రే చీకటి క్యారెక్టర్ చేసారు.

రెండేళ్ల ముందే చంద్రబాబుపై కేసు పెట్టాలి

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు