నిన్న నోటీసులు.. నేడు సోదాలు

అమరావతి రాజధాని ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూముల వ్యవహారంలో.. సీఐడీ విచారణ చురుగ్గా సాగుతోంది. నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు నోటీసులిచ్చి సరిపెట్టిన సీఐడీ అధికారులు ఈరోజు..…

అమరావతి రాజధాని ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చిన అసైన్డ్ భూముల వ్యవహారంలో.. సీఐడీ విచారణ చురుగ్గా సాగుతోంది. నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, మాజీ మంత్రి నారాయణలకు నోటీసులిచ్చి సరిపెట్టిన సీఐడీ అధికారులు ఈరోజు.. నెల్లూరులోని నారాయణ ఇల్లు, ఆఫీసుల్లో సోదాలు నిర్వహించారు.

చంద్రబాబు హయాంలో నారాయణ మున్సిపల్ శాఖ మంత్రిగా పనిచేయడంతో పాటు, రాజధాని ప్రాంత అభివృద్ధి కమిటీ.. సీఆర్డీఏకు వైస్ చైర్మన్ గా కూడా వ్యవహరించారు. రాజధాని భూసేకరణ కమిటీ, ఇతర వ్యవహారాలన్నీ ఆయన కనుసన్నల్లోనే జరిగాయి. చంద్రబాబు సూత్రధారిగా నిలవగా, మాజీ మంత్రి నారాయణ పాత్రధారిగా ఉన్నారు.

నెల్లూరులోని నారాయణ నివాసం సహా.. విజయవాడ, హైదరాబాద్ లో మొత్తం 10 ప్రాంతాల్లో నారాయణకు చెందిన ఇళ్లు, ఆయన బంధువుల ఇళ్లలో కూడా సోదాలు జరుగుతున్నాయని తెలుస్తోంది. ఇలా ఒకేసారి అన్ని ప్రాంతాల్లో సోదా చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేగింది. ముఖ్యంగా టీడీపీ నేతలు మరింత ఆందోళనకు గురవుతున్నారు.

గతంలో నారాయణ సహా.. ఆయన దగ్గరి బంధువులు, ముఖ్యంగా గతంలో ఆయన విద్యా సంస్థల్లో కీలక స్థానంలో ఉన్న ఓ మహిళా ఉద్యోగి పేరుతో అమరావతి ప్రాంతంలో భూముల కొనుగోలు జరిగిందనే ఆరోపణ ఉంది. వీటన్నిటినీ తొలి అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సాక్ష్యాధారాలతో సహా బయటపెట్టారు. 

ఆ తర్వాతి కాలంలో ఆ భూములన్నీ అసైన్డ్ భూములనే విషయం బయటపడింది. అసైన్డ్ భూములను ఎస్సీ, ఎస్టీల దగ్గర అక్రమంగా కొనుగోలు చేయడం, ప్రభుత్వం వద్ద లబ్ధి పొందడంపై మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సీఐడీకి ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో అమరావతి అక్రమాలపై సీఐడీ విచారణ కొనసాగుతోంది.

చంద్రబాబు, నారాయణకు ఇచ్చిన నోటీసుల్లో.. ఈనెల 23న విజయవాడ సీఐడీ కార్యాలయంలో జరిగే విచారణకు హాజరు కావాల్సిందిగా పేర్కొన్నారు అధికారులు. అసైన్డ్ భూములను కొనుగోలు చేయడమే మొదటి తప్పు అయితే, ఆ భూములను రాజధాని కోసం ప్రభుత్వానికి అప్పగించి, వచ్చే ప్రతిఫలాన్ని పేదలకు కాకుండా ప్రైవేటు వ్యక్తులు కొట్టేయడం మరో తప్పు. దీనిపైనే సీఐడీ విచారణ సాగిస్తోంది. 

రెండేళ్ల ముందే చంద్రబాబుపై కేసు పెట్టాలి

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు