సైరా దసరాకా? సంక్రాంతికా?

టాలీవుడ్ లో ఈ ఏడాది మోస్ట్ అవైటింగ్ సినిమాల్లో సైరా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా. రామ్ చరణ్ నిర్మాతగా రెండో సినిమా. ముఖ్యంగా బాహుబలి తరువాత తెలుగులో వస్తున్న అత్యంత భారీ…

టాలీవుడ్ లో ఈ ఏడాది మోస్ట్ అవైటింగ్ సినిమాల్లో సైరా ఒకటి. మెగాస్టార్ చిరంజీవి 151వ సినిమా. రామ్ చరణ్ నిర్మాతగా రెండో సినిమా. ముఖ్యంగా బాహుబలి తరువాత తెలుగులో వస్తున్న అత్యంత భారీ చిత్రాల్లో ఒకటి. ఈ సినిమాను 2019 దసరాకు విడుదల చేయాలన్నది టార్గెట్. అయితే దసరాకు విడుదల సాధ్యమేనా అన్న అనుమానాలు కలుగుతున్నాయి.

వాస్తవానికి షూటింగ్ పార్ట్ ఒకపాట మినహా మిగిలినది అంతా పూర్తయిపోయింది. కొద్దిగా ప్యాచ్ వర్క్ వుంది. కానీ ఈ సినిమాకు గ్రాఫిక్స్ వర్క్ చాలా ఎక్కువ. అవన్నీ పీస్ మీల్ లెక్కన రకరకాల కంపెనీలకు ఇచ్చారు. వీటలో అధికభాగం రష్యా, ఉక్రెయిన్ దేశాల్లోని కంపెనీలకు అందించారు.

ఆ కంపెనీలన్నీ పక్కాగా టైమ్ బౌండ్ ప్రకారం వర్క్ డెలివరీ ఇస్తామని చెబుతున్నాయి. కానీ విజువల్ గ్రాఫిక్స్ వర్క్ టైమ్ కు కావడం అన్నది చాలా రేర్. వర్క్ జరగాలి. అది చూడాలి. మళ్లీ మార్పులు చేర్పులు, క్వాలిటీ చెకింగ్ అన్నీ వుంటాయి. ఆ తరువాత ఫైనల్ కాపీ.

ఇవన్నీ అయిదునెలల్లో జరగాలి. అందుకే సంక్రాంతిని ఆప్షనల్ డేట్ గా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కారణంగా ఇప్పటి నుంచి సినిమా అమ్మకాలు, మార్కెటింగ్ మీద దృష్టిపెట్టడం లేదని తెలుస్తోంది. ఒకసారి డేట్ పక్కా అని అయిడియా వచ్చిన తరువాతే మార్కెటింగ్ స్టార్ట్ చేసే ఉద్దేశంలో నిర్మాత రామ్ చరణ్ వున్నట్లు బోగట్టా.

విజయం పట్ల వైసీపీలో పూర్తి విశ్వాసం

నాని నవ్వు వెనుక ఫుల్ కాన్ఫిడెన్స్ అదేనా?