Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

శ్రీనువైట్ల స్టయిల్ లో అనిల్ రావిపూడి?

శ్రీనువైట్ల స్టయిల్ లో అనిల్ రావిపూడి?

అనిల్ రావిపూడి-మహేష్ బాబు సినిమా మీద కాస్త మంచి ఆశలే వున్నాయి అభిమానులకు. ఈ సినిమాతో మహేష్ బాబు మళ్లీ అవుట్ అండ్ అవుట్ ఎంటర్ టైన్ మెంట్ జోనర్ లో సినిమా చేస్తాడని నమ్మకంగా వున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి కూడా వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాలనే గట్టి పట్టుదలతో వున్నట్లు తెలుస్తోంది. అందుకే ప్రయోగాలు, కొత్తగా ట్రయ్ చేయడాలు లాంటివి పెట్టుకోకుండా, ఓ మినిమమ్ గ్యారంటీ కథను తీసుకుని, కమర్షియల్ వేలో వెళ్లాలని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

టాలీవుడ్ లో దర్శకుడు శ్రీనువైట్లది ఓ విభిన్న శైలి. అది ఎన్నో విజయాలు అందించింది. ఇప్పుడు దాదాపు అలాంటి రూట్లోనే అనిల్ వెళ్తున్నట్లు బోగట్టా. విలన్ హీరోకి అన్యాయం చేయడం, ఆ విలన్ ఆట కట్టించడానికి హీరో ఫన్ వేలో ట్రయ్ చేయడం అన్నమాట.

సినిమాలో జగపతిబాబు విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. హీరోకి తల్లి కాదు కానీ తల్లి లాంటి పాత్రలో విజయశాంతి కనిపిస్తారు. గతంలో పవన్ కళ్యాణ్ కు ఓ సినిమాలో జయసుధ కనిపించినట్లు అని టాక్ వినిపిస్తోంది. బండ్లగణేష్ బాగా డబ్బున్న ఓ పప్పు సుద్ద లాంటి క్యారెక్టర్ లో కనిపిస్తారు.

విజయం పట్ల వైసీపీలో పూర్తి విశ్వాసం

నాని నవ్వు వెనుక ఫుల్ కాన్ఫిడెన్స్ అదేనా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?