ప్రస్తుతం మార్కెట్ లో విజయ్ దేవరకొండ క్రేజ్ నడుస్తోంది. పెళ్లిచూపులు డైరక్టర్ తరుణ్ భాస్కర్ కీలకపాత్రలో ఓ సినిమా ప్రారంభమైంది. వాస్తవానికి ఈ సినిమా కథ విజయ్ దేవరకొండ దగ్గరకు హీరోగా చేయడానికి వచ్చింది. కానీ అనేక కారణాల వల్ల చేయలేదు. కానీ ఆ కథను వదులుకోవడం ఇష్టంలేక చిన్న సినిమాగా తీయాలని డిసైడ్ అయ్యాడు.
ఆ బాధ్యతను తన పెళ్లిచూపులు సినిమా డైరక్టర్ తరుణ్ భాస్కర్ మీద పెట్టాడు. అంతేకాదు, ఆ సినిమాలో తరుణ్ భాస్కర్ నే దాదాపు హీరో. సినిమాకు విజయ్ దేవరకొండ ఫాదర్ వర్థన్ దేవరకొండ నిర్మాణ బాధ్యతలు చూస్తున్నారు. ఈ సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. ఈ సినిమాతో మరో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు.
ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు ఈ సినిమాను నైజాం ఏస్ డిస్ఠ్రిబ్యూటర్ ఏషియన్ సునీల్ అవుట్ రేట్ నే కొనేసారు. సినిమా మొత్తం హక్కులను ఆయన కాస్త మంచి రేటుకే కొనుగోలు చేసినట్లు తెలస్తోంది. ఈ మేరకు నిన్న ఒప్పందాలు కుదిరాయి. చెక్కులు చేతులు మారాయి.