జెర్సీ రీమేక్ పై దిల్ రాజు ఆసక్తి

నాని – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన జెర్సీ సినిమాకు అన్నివైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కలెక్షన్లు కూడా స్టడీగా వున్నాయి. ఈ సంగతి అలావుంచితే, ఈ సినిమా రీమేక్ చేసే ఆలోచనలతో…

నాని – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వచ్చిన జెర్సీ సినిమాకు అన్నివైపుల నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. కలెక్షన్లు కూడా స్టడీగా వున్నాయి. ఈ సంగతి అలావుంచితే, ఈ సినిమా రీమేక్ చేసే ఆలోచనలతో పలువరు ప్రముఖులు ముందుకురావడం విశేషం.

ఎఫ్ 2 సినిమాతో బాలీవుడ్ లో ఫ్రవేశించాలని డిసైడ్ అయిన ఏస్ నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు, తన రెండో ప్రయత్నంగా జెర్సీని ఎంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. జెర్సీ సినిమా హిందీ రీమేక్ రైట్స్ కొనుక్కుని, మాంచి కాస్టింగ్ తో రీమేక్ చేయాలనే ఆలోచన ఆయన వెలిబుచ్చినట్లు తెలిసింది.

ఇదే సమయంలో బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తనకు ఆసక్తి వుందని, ఓసారి సినిమా చూస్తానని జెర్సీ నిర్మాతల దగ్గర వెల్లడించినట్లు తెలుస్తోంది. ఇదిలావుంటే తమిళ సినిమా రంగంలో సుప్రసిద్ధ సంస్థ అయిన లైకా ప్రొడక్షన్స్ కూడా ఈ సినిమాను రీమేక్ చేయడానికి ఆసక్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

జెర్సీ సినిమాను కాస్త ఎక్కువ బడ్జెట్ తోనే నిర్మించారు. హీరో నాని అందుకే రెమ్యూనిరేషన్ తీసుకోకుండా లాభాల్లో వాటా తీసుకుంటా అన్నారు. ఇప్పుడు రీమేక్ హక్కులకు మంచి రేటు పలికితే, నానికి రెమ్యూనిరేషన్ పక్కాగా గిట్టుబాటు అవుతుంది.

విజయం పట్ల వైసీపీలో పూర్తి విశ్వాసం

నాని నవ్వు వెనుక ఫుల్ కాన్ఫిడెన్స్ అదేనా?