Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

పాత్రలో జీవించేస్తున్న నిఖిల్

పాత్రలో జీవించేస్తున్న నిఖిల్

సినిమాలో హీరో ఏ పాత్ర అయినా వేయచ్చు. కానీ కొన్ని పాత్రల్లో మాత్రమే బయట కూడా వ్యవహరించే అవకాశం వుంటుంది. అర్జున్ సురవరం సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో నటిస్తున్నాడు హీరో నిఖిల్. ఇంకేం, చాన్స్ దొరికింది రెచ్చిపోతున్నాడు. బయట సినిమా ప్రమోషన్లలో భాగం అన్నట్లుగా జర్నలిస్ట్ గా తెగ హల్ చల్ చేస్తున్నాడు. 

ఓ రోజంతా ఓ ఛానెల్ కోసం మైక్ పట్టకుని సిటీ రోడ్ల మీద తిరిగి హడావుడి చేసాడు. ఇప్పుడు ఏకంగా ఏదైనా మాంచి ఇంటర్వూ చేసి, తను కూడా ట్రూ జర్నలిస్ట్ అనిపించుకోవాలని డిసైడ్ అయిపోయాడట. అందుకే యూట్యూబ్ స్టార్ అని పేరు తెచ్చుకున్న, రాజకీయ నాయకుడు కేఎ పాల్ ను ఇంటర్వూ చేస్తాడట. అందుకోసం ఇప్పటి నుంచి ప్రయత్నాలు ఫ్రారంభించాడు.

కేఎ పాల్ కనుక హైదరాబాద్ వస్తే, ఇంటర్వూ చేయాలన్నది నిఖిల్ ఆలోచన. అసలే తాను పాతికేళ్ల వాడిలా కనిపిస్తానని, ట్రంప్, బుష్ తో పరిచయాలని, ఇలా ఏదోదో మాట్లాడే పాల్ ను నిఖిల్ ఎలాంటి ప్రశ్నలు వేసి, ఎన్ని నవ్వులు పూసే సమాధానాలు రప్పిస్తాడో చూడాలి. 

టాగోర్ మధు నిర్మించిన అర్జున్ సురవరం మే 1న విడుదలవుతుంది. తమిళ సినిమా గణితన్ ఆధారంగా నిర్మించిన ఈ సినిమాకు సంతోష్ దర్శకుడు.

తెలుగుదేశంలోనూ విజయం మీద ఫుల్ కాన్ఫిడెన్స్!

నాని ఇంటర్వ్యూలో చెప్పినట్లు జెర్సీ సినిమా ఉందా?

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?