ఈ సమ్మర్ లో జనం ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో విజయ్ దేవరకొండ నటించిన డియర్ కామ్రేడ్ ఒకటి. ఈ సినిమాను మే 31న విడుదల చేస్తారని వినిపిస్తూ వచ్చింది. అయితే ఈ సినిమాను ఎప్పుడయితే నాలుగు దక్షిణాది భాషల్లో విడుదల చేయాలని అనుకున్నారో, అప్పటి నుంచి వ్యవహారం కాస్త లేట్ అవుతూ వచ్చింది. ఇప్పుడు అదే నిర్ణయం సినిమాను రెండువారాలు వెనక్కు తోస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సినిమా టాకీ వర్క్ మరో ఒకటి రెండు రోజుల్లో పూర్తవుతుంది. పోస్ట్ ప్రొడక్షన్ కు కావాల్సినంత టైమ్ వుంది. అయితే సరైన డేట్ మాత్రం దొరకడం లేదని తెలుస్తోంది. ముందు అనుకున్న మే 31 డేట్ కు తమిళనాట కాస్త నోటెడ్ సినిమాలు వుండడంతో, డియర్ కామ్రేడ్ ను ఒకటి రెండువారాలు వెనక్కు జరపాలని చూస్తున్నట్లు బోగట్టా.
ఇక్కడ టాలీవుడ్ లో కూడా మే 31 నాటికి శర్వానంద్-సుధీర్ వర్మ సినిమా వుంది. అందువల్ల డియర్ కామ్రేడ్ జూన్ రెండోవారానికి వాయిదా పడుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. భరత్ కమ్మ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీమూవీస్ నిర్మించింది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ విద్యార్థి సంఘ నాయకుడిగా, హీరోయిన్ క్రికెటర్ గా కనిపిస్తారు.