Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

ఈనెల 26న లక్ష్మీస్ ఎన్టీఆర్

ఈనెల 26న లక్ష్మీస్ ఎన్టీఆర్

మొత్తానికి గ్రహణం వీడింది. ఆర్జీవీ సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆంధ్రలో విడుదల కాబోతున్నట్లు బోగట్టా. ఈనెల 26న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా విడుదలకు ముహూర్తం పెట్టినట్లు తెలుస్తోంది. ఈ మేరకు అన్ని అడ్డంకులు తొలగిపోయినట్లు, కోర్టు, ఎన్నికల కమిషన్ వగైరా క్లియరెన్స్ లు వచ్చినట్లు తెలుస్తోంది.

ఈనెల 26న ఏ తెలుగు సినిమా విడుదల లేదు. కేవలం హాలీవుడ్ సినిమా అవెంజర్స్ మాత్రమే వుంది. అందుకే ఆ డేట్ ను లక్ష్మీస్ ఎన్టీఆర్ కోసం ఎంచుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆర్జీవీ నుంచి డిస్ట్రిబ్యూటర్లకు మెసేజ్ లు వెళ్లాయని తెలుస్తోంది. 

లక్ష్మీస్ ఎన్టీఆర్ కు ఎన్నికల ముందు మాంచి క్రేజ్ వచ్చింది. నైజాంలో విడుదలై ఆ సినిమా మంచి కలెక్షన్లు నమోదు చేసింది. కానీ తెలుగుదేశం పార్టీ ప్రయోజనాలు దెబ్బతీస్తుందనే భయంతో వివాదాలు నడిచాయి. ఎన్నికల కమిషన్, కోర్టు కేసులు నడిచాయి. ఆఖరికి ఇప్పుడు విడుదలకు మార్గం సుగమం అయింది. అయితే ఇప్పుడు జనం ఆదరణ ఏ మేరకు వుంటుందో చూడాలి.

మేము చాలా రిస్క్ చేసాం.. నిఖిల్, లావణ్య ఫన్నీ ఇంటర్వ్యూ

నా మనసులో ఏది ఉంటే అదే చేస్తా.. మంచివాళ్ళకే సపోర్ట్

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?