ఆ అక్ర‌మ‌సంబంధాన్ని ధ్రువీక‌రించిన కుంద్రా సోద‌రి!

త‌న మాజీ భార్య త‌న ప్ర‌స్తుత వైఫ్ శిల్పా షెట్టిపై అబాంఢాల‌ను వేయ‌డంపై రాజ్ కుంద్రా సీరియ‌స్ గా స్పందించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను త‌న భ‌ర్త రాజ్ నుంచి శిల్ప వేరు చేసిందంటూ…

త‌న మాజీ భార్య త‌న ప్ర‌స్తుత వైఫ్ శిల్పా షెట్టిపై అబాంఢాల‌ను వేయ‌డంపై రాజ్ కుంద్రా సీరియ‌స్ గా స్పందించిన సంగ‌తి తెలిసిందే. త‌న‌ను త‌న భ‌ర్త రాజ్ నుంచి శిల్ప వేరు చేసిందంటూ రాజ్ మాజీ భార్య క‌విత కొన్ని ఇంట‌ర్వ్యూల్లో చెప్పింది. ఆ పాత ఇంట‌ర్వ్యూలు వైర‌ల్ కావ‌డంతో రాజ్ ఈ అంశంపై స్పందించారు.

ఇలాంటి విష‌యాల‌ను కెలుకుతూ క‌విత మీడియా చాన‌ళ్ల నుంచి డ‌బ్బులు తీసుకుంటోంద‌ని రాజ్ అన్నాడు. అంతే కాదు.. క‌విత  గురించి తీవ్ర‌మైన విష‌యాల‌ను రాజ్ చెప్పుకొచ్చాడు. త‌న సోద‌రి రీనా భ‌ర్త‌తో క‌విత ఎఫైర్ పెట్టుకుంద‌ని, ఈ విష‌యంలో త‌న త‌ల్లి ప‌లు సార్లు చెప్పినా క‌విత ప్ర‌వ‌ర్త‌న మార్చుకోలేద‌ని.. త‌మ విడాకుల‌కు అదే కార‌ణ‌మ‌ని రాజ్ కుంద్రా చెప్పాడు. 

ఈ అంశంపై తాజాగా రాజ్ కుంద్రా సోద‌రి రీనా కూడా స్పందించింది. త‌న మాజీ వ‌దిన‌, త‌న భ‌ర్త‌తో అక్ర‌మ సంబంధం పెట్టుకున్న మాట వాస్త‌వ‌మే అని రీనా అంటోంది. క‌విత‌ను త‌ను ఒక సోద‌రిలా చూశాన‌ని, చాలా అభిమానించాన‌ని, అయితే ఆమె మాత్రం ఏకంగా త‌న భ‌ర్త‌తో ఎఫైర్ పెట్టుకుని అక్ర‌మ సంబంధానికి ఒడిగట్టింద‌ని.. రీనా చెబుతోంది. 

ఈ విష‌యం త‌న‌కు గుండెకోత‌ను మిగిల్చింద‌ని రీనా వాపోయింది. ఇన్నాళ్లూ మొద‌టి భార్య‌తో రాజ్ కుంద్రా విడాకుల అంశం తెర‌పైకి వ‌చ్చిన‌ప్పుడు అత‌డు, శిల్ప కామ్ గా ఉండే వారు. అయితే ఈ వ్య‌వ‌హారంలో వారు అక్ర‌మ‌సంబంధం అంశాన్ని ప్ర‌స్తావించి క‌విత  ప్ర‌చారానికి చెక్ పెట్టిన‌ట్టుగా ఉన్నారు. రీనా కూడా ఈ అంశాన్ని ధ్రువీక‌రిస్తూ సోద‌రుడికి స‌పోర్ట్ గా నిలుస్తోంది.