ప్రస్తుతం కెరీర్ పరంగా పీక్స్ లో ఉంది కీర్తీ సురేష్. మహానటి తర్వాత ఈ నటి జాతకం మారిపోయిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోల సినిమాలతో బిజీగా ఉంది. త్వరలో మరిన్ని భారీ ప్రాజెక్టులకు ఈమె సైన్ చేయనుందనే వార్తలూ వస్తున్నాయి. ఇంతలోనే కీర్తీ సురేష్ పెళ్లి అనే రూమర్ ఒకటి రెండు రోజులుగా షికారు చేయడం మొదలుపెట్టింది. కేరళకు చెందిన ఒక బిజినెస్ టైకూన్ ను కీర్తీ పెళ్లి చేసుకోబోతోందనేది ఆ రూమర్ సారాంశం.
అయినా కెరీర్ పీక్స్ లో ఉండగా హీరోయిన్ లు పెళ్లి ప్రయత్నాలు ఏవీ చేయరనే అనుమానం ఉండనే ఉంది. ఈ క్రమంలో తన పెళ్లి మీద వస్తున్న ఊహాగానాల విషయంలో కీర్తి స్పందించింది. ప్రస్తుతానికి పెళ్లి ఊసు లేదని ఆమె స్పష్టం చేసింది. ఆ రూమర్లను తను విని ఆశ్చర్యపోయినట్టుగా కీర్తీ చెప్పుకొచ్చింది.
అవి పూర్తిగా రూమర్లే అని, తన పెళ్లి ఇప్పుడే కాదని ఈ హీరోయిన్ స్పష్టత ఇచ్చింది. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచన కూడా తనకు లేదని కీర్తీ సురేష్ కుండబద్ధలు కొట్టింది. ఈ విధంగా రూమర్లకు బ్రేక్ వేసే ప్రయత్నం చేసింది ఈ నటీమణి.