చిరంజీవి ..చిరంజీవి..చిరంజీవి

సిసిసి తెలుగు సినిమా కార్మికల కోసం ఏర్పాటైన ఉప సంస్థ. దీని ప్రధాన సంస్థ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్. దీనికి సినిమా వాళ్లు అంతా విరాళాలు ఇచ్చారు. కేవలం చిరంజీవి విరాళంలో ఇది నడవడం…

సిసిసి తెలుగు సినిమా కార్మికల కోసం ఏర్పాటైన ఉప సంస్థ. దీని ప్రధాన సంస్థ చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్. దీనికి సినిమా వాళ్లు అంతా విరాళాలు ఇచ్చారు. కేవలం చిరంజీవి విరాళంలో ఇది నడవడం లేదు. హీరోలు అంతా యథాశక్తి ఇచ్చారు. నిర్మాతలు ఇచ్చారు. దర్శకులు ఇచ్చారు.

కానీ దీని నిర్వాహకులు మాత్రం చిరంజీవి..చిరంజీవి..చిరంజీవి అని కలవరిస్తున్నారు. ఎన్ శంకర్, తమ్మారెడ్డి భర్వాద్వాజ, మెహర్ రమేష్ తదితరులకు ఈ బాధ్యతలు అప్పగించారు. తమకు బాధ్యతలు అప్పగించమే అద్భుత అవకాశం అన్నట్లు వీళ్లు ఫీలవుతున్నట్లు కనిపిస్తోంది.

దాంతో ఏం చేసినా, చిరంజీవి..చిరంజీవి..చిరంజీవి అంటూ కలవరించేస్తున్నారు. ఎంతమందికి ఇచ్చారో తెలియదు. ఎన్ని సరుకులు ఇచ్చారో తెలియదు. ఎంత ఖర్చు అన్నది లేదు. ఈ రోజు విడుదల చేసిన ప్రెస్ రిలీజ్ లో. కానీ అందులో చిరంజీవి పేరు మాత్రం వీలయినన్ని ఎక్కువ సార్ల దొర్లించడానికి ప్రయత్నించారు. చిరంజీవి సారథ్యంలో అంటూ చిరంజీవి చేసిన అద్భుత ఆలోచన అంటూ, చిరంజీవి ఇచ్చిన విరాళం అంటూ ఆయననే గాలిలోకి ఎత్తే ప్రయత్నం కనిపించింది ప్రెస్ నోట్ లో. 

సరే, చిరంజీవిని భుజాన ఎత్తుకోవడం అన్నది వాళ్ల ఆనందం కావచ్చు, మొత్తం ఎంత మందికి ఇస్తున్నారు? ఒక్కో ప్యాకేజ్ కు ఎంత ఖర్చు అవుతోంది.? ఏయే డిపార్ట్ మెంట్లకు ఇస్తున్నారు, ఈ రోజు అప్ డేట్ ఇదీ అంటూ డిటైల్డ్ గా చెబితే బాగుంటుంది. అలా కాకుండా కార్యక్రమం సాగినన్నాళ్లు చిరంజీవి..చిరంజీవి అనుకుంటూ వుంటే ప్రెస్ నోట్ ఇలా చూసి, అలా పక్కన పెట్టడానికి తప్ప మరెందుకు పనికిరాదు.

కరోనా తగ్గేవరకన్నా కొంచెం తగ్గండి బాబు గారూ