నాగార్జున సరసన హీరోయిన్ ఫిక్స్

సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత అనేది చాన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్య. ఇప్పుడీ సమస్యకు కాజల్ రూపంలో ఓ పరిష్కారం దొరికింది.  Advertisement రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలు కాంప్రమైజ్ అవ్వకపోతే సీనియర్ హీరోల సినిమాలకు కాల్షీట్లు…

సీనియర్ హీరోలకు హీరోయిన్ల కొరత అనేది చాన్నాళ్లుగా వెంటాడుతున్న సమస్య. ఇప్పుడీ సమస్యకు కాజల్ రూపంలో ఓ పరిష్కారం దొరికింది. 

రెమ్యూనరేషన్ విషయంలో నిర్మాతలు కాంప్రమైజ్ అవ్వకపోతే సీనియర్ హీరోల సినిమాలకు కాల్షీట్లు ఇవ్వడానికి కాజల్ కు ఎలాంటి అభ్యంతరం లేదు. ఇందులో భాగంగా నాగార్జున సరసన హీరోయిన్ గా నటించడానికి అంగీకరించింది ఈ ముద్దుగుమ్మ.

15 ఏళ్లుగా ఇండస్ట్రీలో కొనసాగుతోంది కాజల్. అటు నాగార్జున కూడా ప్రతి ఏటా సినిమాలు చేస్తున్నాడు. కానీ వీళ్లిద్దరూ కలిసి ఎప్పుడూ సినిమాలు చేయలేదు. గతంలో నాగచైతన్య-కాజల్ కు మధ్య జరిగిన గొడవ కారణంగానే నాగ్ ఈ నిర్ణయం తీసుకున్నాడని అంటారు కొంతమంది. ఎట్టకేలకు నాగ్-కాజల్ కలుస్తున్నారు.

ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో రాబోతున్న సినిమాలో నాగార్జున సరసన కాజల్ ను హీరోయిన్ గా తీసుకున్నారు. ఈ విషయాన్ని కాజల్ స్వయంగా ప్రకటించింది కూడా. ఈ నెలాఖరు నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది.

ఈ మూవీ కోసం ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నాడు నాగార్జున. ప్రస్తుతం నడుస్తున్న ట్రెండ్ కు తగ్గట్టు గుబురు గడ్డం పెంచాలని ఫిక్స్ అయ్యాడు. అదే గెటప్ తో వైల్డ్ డాగ్ ప్రమోషన్స్ లో కూడా పాల్గొంటున్నాడు. ప్రవీణ్ సత్తారు డైరక్షన్ లో చేయబోయే సినిమా కూడా యాక్షన్ ఎంటర్ టైనరే. 

రెండేళ్ల ముందే చంద్రబాబుపై కేసు పెట్టాలి

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు