వకీల్ సాబ్ ను ఎక్కడ సెట్ చేయాలి

రీసెంట్ గా తను రిలీజ్ చేసిన షాదీ ముబారక్ అనే చిన్న సినిమాను పూర్తిగా లైట్ తీసుకున్న నిర్మాత దిల్ రాజు, ఇప్పుడు తన దృష్టి మొత్తాన్ని వకీల్ సాబ్ సినిమాపై పెట్టాడు. లిరికల్…

రీసెంట్ గా తను రిలీజ్ చేసిన షాదీ ముబారక్ అనే చిన్న సినిమాను పూర్తిగా లైట్ తీసుకున్న నిర్మాత దిల్ రాజు, ఇప్పుడు తన దృష్టి మొత్తాన్ని వకీల్ సాబ్ సినిమాపై పెట్టాడు. లిరికల్ వీడియోలు రిలీజ్ చేస్తూ సంప్రదాయబద్ధంగా సాగుతున్న ఈ సినిమా ప్రచారాన్ని నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లాలంటే ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పెట్టాల్సిందే. సరిగ్గా ఇక్కడే దిల్ రాజు డైలమాలో పడ్డాడు.

పవన్ ను ప్రచారానికి తీసుకురావాలంటే దిల్ రాజు దగ్గరున్న ఏకైక అస్త్రం ప్రీ-రిలీజ్ ఫంక్షన్. పవన్ ఎలాగూ మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడు. నగర పర్యటనలు చేయడు. సినిమా కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడు. కాబట్టి భారీగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ఏర్పాటుచేసి, పవన్ ను లాక్ చేయడం ఒక్కటే మార్గం. 

ప్రస్తుతం ఆ దిశగానే దిల్ రాజు ఆలోచిస్తున్నాడు. కాకపోతే, ఏప్రిల్ మొదటి వారంలో పెట్టాలనుకుంటున్న ఈ ఫంక్షన్ కు పవన్ ను తీసుకురావాలంటే.. చాలా హోం వర్క్ చేయాల్సి ఉంటుంది. 

పవన్ ప్రస్తుతం ఒకేసారి 2 సినిమాలు చేస్తున్నాడు. పొద్దున్న ఒక సినిమా షూటింగ్, మధ్యాహ్నం మరో సినిమా షూటింగ్.. సాయంత్రం రాజకీయ వ్యవహారాలు అనే టైపులో సాగుతోంది అతడి దినచర్య. ఇలా బిజిబిజీగా ఉన్న పవన్ ను ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు వచ్చేలా ఒప్పించడం దిల్ రాజుకు ఇప్పుడు పెద్ద టాస్క్ గా మారింది.

మరోవైపు వకీల్ సాబ్ ప్రచారంపై ఇప్పటికే పవన్ ఫ్యాన్స్ లో అసహనం ఉంది. యూనిట్ చేస్తున్న ప్రచారం కంటే, సంగీత దర్శకుడు తమన్ ఇస్తున్న అప్ డేట్స్ చాలా బాగున్నాయంటూ సెటైర్లు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో.. పవన్ ను దిల్ రాజు, ఎట్టిపరిస్థితుల్లో ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు తీసుకురావాల్సిందే. 

రెండేళ్ల ముందే చంద్రబాబుపై కేసు పెట్టాలి

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు