విశాఖను భయపెడుతున్న కరోనా ?

విశాఖను మళ్ళీ కరోనా భయం ఆవహించింది. ఈ మధ్య కాలం దాకా అంతా హ్యాపీగా ఉంది అనుకున్నారు. కరోనా నంబర్ కూడా బాగా తగ్గిపోయింది. కొన్నిర్లు సింగిల్ డిజిట్ నంబర్లు కూడా నమోదు అయ్యాయి.…

విశాఖను మళ్ళీ కరోనా భయం ఆవహించింది. ఈ మధ్య కాలం దాకా అంతా హ్యాపీగా ఉంది అనుకున్నారు. కరోనా నంబర్ కూడా బాగా తగ్గిపోయింది. కొన్నిర్లు సింగిల్ డిజిట్ నంబర్లు కూడా నమోదు అయ్యాయి. దాంతో విశాఖ ఊపిరి పీల్చుకుంది.

కొత్త కేసులు పెద్దగా లేకపోగా కరోనాతో చికిత్స పొందుతున్న వారు కూడా సింగిల్ డిజిట్ కి దగ్గరలో ఉండడంతో విశాఖను కరోనా ఫ్రీ జిల్లాగా ప్రకటిస్తారు అనుకుంటున్న వేళ సీన్ రివర్స్ అయింది. 

అయితే ఉన్నట్లుండి విశాఖలోని ఒక పాఠశాలలో విద్యార్ధులకు కరోనా సోకడంతో కలకలం మొదలైంది. దాంతో పాటు మళ్ళీ టెస్టులను పెంచడంతో ఒక్కసారిగా డబుల్ డిజిట్ కి నంబర్ ఎగబాకింది.

అర్ధ సెంచరీకి చేరువలో ప్రతీ రోజూ కేసులు నమోదు కావడంతో స్మార్ట్ సిటీ వణుకుతోంది. ఆ మధ్యన ప్రతీ రోజూ వందల్లో కేసులు నమోదు అయ్యాయి. మళ్ళీ అలాంటి పరిస్థితులు వస్తాయా అని జనాలు  బెంబేలెత్తుతున్నారు.

రెండేళ్ల ముందే చంద్రబాబుపై కేసు పెట్టాలి

ఇలాంటి క‌థ ఎప్పుడూ విన‌లేదు