లేటు వయసులో వాళ్ల మధ్య ఘాటు ప్రేమ. ఆ ప్రేమకు ప్రతిరూపంగా త్వరంలో పండంటి మగబిడ్డ జన్మించనున్నాడు. త్వరలో ఓ బిడ్డకు తండ్రి కాబోతున్నట్టు 89 ఏళ్ల ఎకిల్‌స్టోన్ మురిపెంగా చెబుతున్నాడు. అందుకే ఆయన చెప్పిన ఈ విషయానికి ఇప్పుడు ఎంతో ప్రాధాన్యం.
1978 నుంచి 2017 వరకు ఫార్ములావన్ సీఈఓగా ఎకిల్‌స్టోన్ విశేష సేవలందించాడు. లేటు వయసులోనూ నాన్నయ్యే ‘ఫార్ములా’ పంట పండిందని నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున కామెంట్స్ వస్తున్నాయి. ఎకిల్‌స్టోన్ మూడో భార్య 44 ఏళ్ల ఫాబియానా ఫ్లోసి ఈ జూలైలో తన వృద్ధ పెనిమిటికి వారసుణ్ని బహుమతిగా ఇవ్వనుంది.
వైద్య పరీక్షల్లో ఆమెకు కలిగే సంతానం మగ శిశువని తేలింది. మగబిడ్డకు జన్మినిచ్చే విషయం తెలిసినప్పటి నుంచి తన భార్య ఆనందానికి అవధుల్లేవని ఎకిల్‌స్టోన్ చెబుతున్నాడు. ఈ వయసులో తమకు పిల్లలు పుడతారని అసలు ఊహించలేదని అతను అన్నాడు. ఎకిల్‌స్టోన్‌కు తన మాజీ ఇద్దరు భార్యల ద్వారా ముగ్గురు అమ్మాయిలు ఉన్నారు.