స‌మంత‌, నాగ చైత‌న్య‌.. ఇది యాదృచ్ఛిక‌మేనా!

మాజీ భార్యాభ‌ర్త‌లు స‌మంత‌, నాగ‌చైత‌న్య‌లు యాదృచ్ఛికంగానో, వారికి ముందే ఉన్న క‌మిట్ మెంట్స్ ప్ర‌కార‌మో కానీ, ఒకేసారి బాలీవుడ్ జ‌నాల మ‌ధ్య‌న సంద‌డి చేస్తున్నారు.  Advertisement ఇప్ప‌టికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ ద్వారా…

మాజీ భార్యాభ‌ర్త‌లు స‌మంత‌, నాగ‌చైత‌న్య‌లు యాదృచ్ఛికంగానో, వారికి ముందే ఉన్న క‌మిట్ మెంట్స్ ప్ర‌కార‌మో కానీ, ఒకేసారి బాలీవుడ్ జ‌నాల మ‌ధ్య‌న సంద‌డి చేస్తున్నారు. 

ఇప్ప‌టికే ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరిస్ ద్వారా స‌మంత హిందీ జ‌నాల‌ను ప‌ల‌క‌రించింది. ఆమె న‌టించిన య‌శోధ హిందీలో కూడా భారీ రిలీజ్ ను పొంద‌నుంది. ప్ర‌స్తుతం హిందీలో త‌న‌ను తాను ప్ర‌మోట్ చేసుకోవ‌డం కోసం స‌మంత బాలీవుడ్ స్టార్ల‌తో టాక్ షో ల‌కూ హాజ‌ర‌వుతోంది.

ఒక‌వైపు స‌మంత ఇలా హ‌డావుడి చేస్తూ ఉండ‌గా.. మ‌రోవైపు నాగ‌చైత‌న్య బాలీవుడ్ సినిమా ప్ర‌మోష‌న్ హ‌డావుడి కూడా మొద‌లైంది. హాలీవుడ్ సినిమా ఫారెస్ట్ గంప్ కు రీమేక్ గా రూపొందిన లాల్ సింగ్ చ‌ద్ధా విడుద‌ల‌కు స‌న్న‌ద్ధం అవుతోంది. ఇందులో నాగ‌చైత‌న్య ఒక ముఖ్య‌మైన పాత్ర‌ను పోషించిన సంగ‌తి తెలిసిందే. 

హాలీవుడ్ వెర్ష‌న్ లో న‌ల్ల సైనికుడి పాత్ర ఒక‌టి ఉంటుంది. ఫారెస్ట్ గంప్ కు సైన్యంలో ఉండ‌గా ప‌రిచ‌యం అవుతుంది ఆ పాత్ర‌. అయితే ఆ పాత్ర సినిమాలో విషాదాంతం అవుతుంది. బ‌హుశా నాగ‌చైత‌న్య అదే పాత్ర‌ను హిందీ వెర్ష‌న్లో చేసి ఉండ‌వ‌చ్చు. 

కొద్ది సేపు క‌నిపించే పాత్రే అయినా.. ఈ సినిమా ప్ర‌మోష‌న్లో నాగ చైత‌న్య భాగ‌స్వామి అవుతున్నాడు. ఇలా ఈ మాజీ భార్యాభ‌ర్త‌లు ఒకేసారి హిందీలో హ‌డావుడి చేస్తూ ఉన్నారు.