నాగ్ చైతన్య-పరుశురామ్ కాంబినేషన్ లో సినిమా అన్నది ఎప్పటి నుంచో వినిపిస్తోంది. 14 రీల్స్ సంస్థ నిర్మించాల్సి వుంది ఈ సినిమాను. అయితే మధ్యలో సర్కారు వారి పాట అడ్డం పడింది.
ఇప్పుడు చేద్దాం అంటే నాగ్ చైతన్య బిజీగా వున్నాడు. వెంకట్ ప్రభు డైరక్షన్ లో పోలీస్ క్యారెక్టర్ చేయబోతున్నాడు. అది కూడా ఫుల్ మాస్ సినిమా. దీని తరవాత అయినా పరశురామ్ తో చేస్తాడా అన్నది చూడాలి.
ఇదిలా వుంటే పరశురామ్ ఇంకా తనకు స్క్రిప్ట్ నెరేషన్ ఇవ్వలేదని చైతన్య క్లారిటీ ఇచ్చాడు. త్వరలో కథ చెబుతారని వెల్లడించాడు. అదేమైనా డబుల్ రోల్ కథనా అని ప్రశ్నిస్తే, కానే కాదని చెప్పాడు చైతూ.
వచ్చే ఏడాది ప్రీ సమ్మర్ నాటికి వెంకట్ ప్రభు సినిమా రెడీ అవుతుందని అన్నాడు. అప్పటి వరకు పరశురామ్ సినిమా ప్రీ ప్రొడక్షన్ లోనే వుంటుందన్నమాట.
ఈ లోగా మరే మంచి డైరక్టర్ మరో సబ్జెక్ట్ తో చైతూ దగ్గరకు రాకపోతే పరశురామ్ ప్రాజెక్ట్ వుంటుంది. అలా కాకుండా మంచి డైరక్టర్, మంచి సబ్జెక్ట్ దొరికితే మరింత వెనక్కు వెళ్లే అవకాశం వుంది.