లాక్ డౌన్ టైమ్ లో జీ టీవీలో నేరుగా విడుదలవుతున్న వెబ్ మూవీ లోల్ సలామ్. జూన్ 25 జీ 5 లో విడుదలవుతోందీ ఆన్ లైన్ సినిమా.
దాదాపు అంతా కొత్తవారితో తీసిన సినిమా ఇది. విడుదలకు రెడీ కావడంతో ట్రయిలర్ ను వదిలారు. సినిమా కాన్సెప్ట్ ఏమిటన్నది క్లారిటీగా చెప్పేసారు.
రాజు, రెడ్డి, నాయుడు, హిందూ, క్రిస్టియన్ ఇలా సకల సమ్మేళనం అయిన నలుగురయిదుగురు కుర్రాళ్లు లాంగ్ డ్రయివ్ కు వెళ్లడం, అడవిలో ఓ కుర్రాడు లాండ్ మెయిన్ మీద కాలేయడం. అది తీస్తే పేలుతుంది. తీయాలంటే ఏం చేయాలో తెలియదు. ఈ అగచాట్లు అన్నీ ఫన్నీ మూవ్ మెంట్లుగా మార్చి, సినిమాగా తీసారు.
అన్నీ కొత్త మొహాలే. ట్రయిలర్ లో ఎలా వున్నా, ఫుల్ లెంగ్త్ లో వీళ్లు ఎలా ఫన్ పండించగలిగారు అన్న దాన్ని బట్టి రిజల్ట్ వుంటుంది. సినిమాకు నాని దర్శకుడు.