‘నచ్చింది గర్ల్ ఫ్రెండ్’

అమ్మాయి నచ్చాలే కానీ ఆమె కోసం ఎంత దూరమైన వెళ్తారు కుర్రకారు. అలాంటి కాన్సెప్ట్ తో నిర్మిస్తున్న సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండ్. నచ్చిన అమ్మాయి కోసం ఎంతదూరం వెళ్ళాడు? ఏం చేశాడు? అన్నదే…

అమ్మాయి నచ్చాలే కానీ ఆమె కోసం ఎంత దూరమైన వెళ్తారు కుర్రకారు. అలాంటి కాన్సెప్ట్ తో నిర్మిస్తున్న సినిమా నచ్చింది గర్ల్ ఫ్రెండ్. నచ్చిన అమ్మాయి కోసం ఎంతదూరం వెళ్ళాడు? ఏం చేశాడు? అన్నదే ఈ కథ. సౌజన్య ఆర్. అట్లూరి సమర్పణలో శ్రీరామ్ మూవీస్ పతాకంపై ఉదయ్ శంకర్,జెన్నీఫర్, మధు నందన్, శ్రీకాంత్ అయ్యాంగార్ నటీ నటులు గా గురు పవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణ రావు నిర్మించిన చిత్రం “నచ్చింది గర్ల్ ఫ్రెండ్”.ఈ చిత్రం గోవా లో జరిగే ఒక పాట మినహా షూటింగ్ పూర్తి చేసుకొంది.

జులై 19 న హీరో ఉదయ్ శంకర్ బర్త్ డే పురస్కరించుకొని చిత్ర యూనిట్ కేక్ ను కట్ చేసి బర్త్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా నిర్వహించింది. అనంతరం చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో హీరో ఉదయ్ శంకర్, మాట్లాడుతూ.. చంద్ర సిద్దార్థ్ దర్శకత్వంలో “ఆట గదరా శివ” తో జర్నీ స్టార్ట్ అయ్యి రేపటికి నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది. ఈ నాలుగు సంవత్సరాలలో ఈ సినిమాతో కలిపి నాలుగు సినిమాలు చేయడం చాలా సంతోషంగా ఉంది. 

“నచ్చింది గర్ల్ ఫ్రెండ్” సినిమా చాలా బాగా వచ్చింది. దర్శకుడు పూరీ జగన్నాథ్ శిష్యుడు గురు పవన్ మంచి కథను సెలెక్ట్ చేసుకుని కమర్సియల్ లవ్ స్టోరీ గా తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాతో మంచి పేరు వస్తుందని ఆశిస్తున్నా…అన్నారు. మా సినిమాను ప్రేక్షకులందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర నిర్మాత అట్లూరి నారాయణ రావు మాట్లాడుతూ.. ఈ సినిమా టాకీ పార్ట్ కంప్లీట్ అయ్యింది. దర్శకుడు గురు పవన్ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. గిఫ్టన్ మ్యూజిక్ బాగా వచ్చింది. త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమాను అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను అన్నారు.

చిత్ర దర్శకుడు గురు పవన్ మాట్లాడుతూ..హీరో ఉదయ్ శంకర్ కు బర్త్ డే శుభాకాంక్షలు. “నచ్చింది గర్ల్ ఫ్రెండ్” టైటిల్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. మన యూత్ కు నచ్చితే ఎంత దూరమైనా వెళ్తాము. ఆలా ఈ చిత్రంలో హీరో ఆ అమ్మాయి కోసం ఎంతదూరం వెళ్ళాడు ఏం చేశాడు అన్నదే ఈ కథ. 

ఒక పాట మినహా సినిమా మొత్తం ఫినిష్ చేసుకొంది. మిగిలిన ఒక్క పాటను గోవాలో షూట్ చేస్తున్నాము. ఆగష్టు లో పోస్ట్ ప్రొడక్షన్స్ పూర్తి చేసుకొని సెప్టెంబర్ లో సినిమా విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నాము అన్నారు.

సంగీత దర్శకుడు గిఫ్టన్..సినిమాటోగ్రాఫర్ సిద్దం మనోహర్, నటుడు సౌరవ్ తదతరులు పాల్గొని ప్రసంగించారు.