రాశీఖన్నా చివరాఖరి చాన్స్?

ఓ హీరోయిన్ కు తెలుగులో దాదాపు పదేళ్ల కెరీర్ అంటే చెప్పుకోదగ్గ విషయమే. తనతో జర్నీ ప్రారంభించిన మిగిలిన హీరోయిన్ల కన్నా బెటర్ గానే ముందుకు సాగుతూ వస్తోంది రాశీఖన్నా. ఎన్నో అపజయాలు పలకరిస్తున్నా…

ఓ హీరోయిన్ కు తెలుగులో దాదాపు పదేళ్ల కెరీర్ అంటే చెప్పుకోదగ్గ విషయమే. తనతో జర్నీ ప్రారంభించిన మిగిలిన హీరోయిన్ల కన్నా బెటర్ గానే ముందుకు సాగుతూ వస్తోంది రాశీఖన్నా. ఎన్నో అపజయాలు పలకరిస్తున్నా చాన్స్ లు వస్తూనే వున్నాయి. 

ఆక్సిజన్, టచ్ చేసి చూడు, శ్రీనివాస కళ్యాణం, వెంకీ మామ, వరల్డ్ ఫేమస్ లవర్, పక్కా కమర్షియల్ ఇలా ఫ్లాపుల జాబితా పెద్దదే. అయితే మధ్యలో తొలిప్రేమ, ప్రతి రోజూ పండగే లాంటి ఒకటి రెండు హిట్ లు వున్నాయి.

ప్రస్తుతం చేతిలో వున్న ఒకే ఒక్క తెలుగు సినిమా థాంక్యూ. దిల్ రాజు ప్రొడక్షన్. చైతన్య హీరో. విక్రమ్ కుమార్ దర్శకుడు. మంచి ప్రామిసింగ్ ప్రాజెక్ట్ నే. కానీ రావాల్సినంత బజ్ రావడం లేదు. సినిమాను నిర్మాత దిల్ రాజు ఎంత తన భుజాల మీద మోస్తున్నా, సరిపోవడం లేదు. 

ఇక మౌత్ టాక్ మాత్రమే ఆప్షన్. ఒక విధంగా ఇది కూడా మంచిదే. తక్కువ బజ్ తో వస్తేనే బెటర్. ఏమాత్రం మౌత్ టాక్ వచ్చినా సినిమా థియేటర్లో నిల్చుంటుంది అనే ఒపీనియన్ కూడా వుంది.

చైతన్య సంగతి ఎలా వున్నా, రాశీఖన్నాకు మాత్రం సక్సెస్ చాలా అవసరం. అందులోనూ పక్కా కమర్షియల్ లాంటి డిజాస్టర్ నుంచి తేరుకుని, మరో చాన్స్ అందుకోవాలి అంటే థాంక్యూ సినిమా ఇంతో అంతో పేరు తీసుకురావాలి. ఈ సినిమాలో రాశీతో పాటు మరో ఒకరిద్దరు హీరోయిన్లు కూడా వున్నారు. అందువల్ల రాశీ లక్ ఎలా వుంటుందో చూడాలి.