వైసీపీ సంక్షేమంపై తమ్ముడు ఒప్పుకోలు

వైసీపీ సర్కార్ ఏమీ చేయడంలేదని టీడీపీ నేతలు విమర్శిస్తారు. ఏపీలో అసలు ఏమీ జరగడంలేదని కూడా బండెడు నిందలు వేస్తారు. ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు అమలవుతున్నా ఏమీ జరగనట్లు, తామేమీ ఎరగనట్లుగా…

వైసీపీ సర్కార్ ఏమీ చేయడంలేదని టీడీపీ నేతలు విమర్శిస్తారు. ఏపీలో అసలు ఏమీ జరగడంలేదని కూడా బండెడు నిందలు వేస్తారు. ఏపీలో పెద్ద ఎత్తున సంక్షేమ పధకాలు అమలవుతున్నా ఏమీ జరగనట్లు, తామేమీ ఎరగనట్లుగా కూడా వారు ఆరోపణలు చేస్తారు.

ఇన్ని లక్షల కోట్లు అప్పులు ఎందుకు చేశారూ అని చంద్రబాబు నుంచి దిగువ స్థాయి నేత దాకా నిలదీతారే తప్ప అప్పులు చేసినవి సంక్షేమం కోసమని మాత్రం ఎక్కడా చెప్పరు, ఆ మాట నోటి వెంట రావడానికి కూడా వారు  అంగీకరించరు.

కానీ విశాఖ తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ పల్లా శ్రీనివాసరావు మాత్రం విమర్శలలో కూడా కొన్ని నిజాలు చెప్పి వైసీపీ ఏలుబడిలో జరుగుతున్న దాన్ని ఒప్పుకున్నారు. ఆయన ఏమంటారు అంటే ఏపీ సర్కార్ అప్పులు చేసి సంక్షేమ పధకాలు అమలు చేస్తోందని. నిజమే కదా ఇదే మాటను వైసీపీ మంత్రులు నేతలు కూడా చెబుతున్నారు కదా.

మేము అప్పులు చేసైనా హామీలు నెరవేరుస్తున్నామని కదా రోజుకు పది సార్లు వైసీపీ వారు మీడియా ముందుకొచ్చి చెబుతున్నది. కానీ ఇన్నాళ్లకు ఒక్క తమ్ముడు అయినా ఈ నిజాన్ని ఒప్పుకున్నారు, ఒక విధంగా ఇది సంతోషం అయిన మాటే. అయితే పల్లా మాత్రం ఏపీ శ్రీలంక అవుతుందని భయపెట్టేస్తున్నారు. ఓట్ల కోసం పధకాలు పెట్టి వాటి అమలు కోసం అప్పులు చేస్తూ ఏపీని శ్రీలంక చేస్తున్నారు అని ఆయన విమర్శిస్తున్నారు.

ఇలాంటి ప్రభుత్వాన్ని ఓడించాలని కూడా పిలుపు ఇచ్చారు. ఇదంతా బాగానే ఉంది కానీ టీడీపీ రేపటి రోజున పవర్ లోకి  వస్తే అప్పులు చేయమని, సంక్షేమ పధకాలు ఏ ఒక్కటి కూడా అమలు చేయమని హామీ ఇవ్వగలరా పల్లా వారూ అని వైసీపీ నేతలు అడుగుతున్నారు. 

ఏపీ శ్రీలంక ఎలా అవుతుంది, అది దేశం, ఇది రాష్ట్రం, ఏపీకి పైన పెద్దన్నగా కేంద్రం ఉంటుందని తెలిసి కూడా ఇలా అసత్యాలు భయాలు ప్రచారం చేయడం తగునా అని కూడా అడుగుతున్నారు.