హీరో సాయం పదిమందికే ?

ఆయన ఓ సీనియర్ హీరో. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న కార్మికులను ఆదుకుంటానంటూ ముందుకు వచ్చారు. దాంతో అబ్బో, సూపర్ అనుకున్నారు అంతా. అప్పటికి ఇంకా చిరంజీవి సిసిసి లాంటి వ్యవహారాలు కూడా లేవు.…

ఆయన ఓ సీనియర్ హీరో. కరోనా కారణంగా ఇబ్బంది పడుతున్న కార్మికులను ఆదుకుంటానంటూ ముందుకు వచ్చారు. దాంతో అబ్బో, సూపర్ అనుకున్నారు అంతా. అప్పటికి ఇంకా చిరంజీవి సిసిసి లాంటి వ్యవహారాలు కూడా లేవు. అందువల్ల మంచిదే కదా, హీరో అంటే హీరోలా వుండాలి అనుకున్నారు అంతా.

సదరు హీరో తరపున సరుకులు తయారుచేసి, పంపిణీ చేసే కార్యక్రమం ఫలానా టైమ్ లో వుందని ఇండస్ట్రీలో వున్న చిన్న చితక జనాలకు తెలిసింది. పాపం, ఆశతో వెళ్లారు. కానీ ఓ పది, పదిహేను మందికి ఇచ్చి కొన్ని సరుకులు, బియ్యం ఇచ్చి అయిపోయింది, అందరికీ ఇచ్చేసాం ఇంక లేవనేసారట.

దీంతో వెళ్లిన వాళ్లు డిల్ల మొహం వేసుకుని వెనక్కు వచ్చారు. కానీ ఈ కార్యక్రమానికి ముందే హీరో ఇంత సాయం, అంత సాయం, సూపర్ హీరో అంటూ పబ్లిసిటీ అయితే వచ్చేసింది. ఇంక సరుకులు ఇస్తే ఎంత? ఇవ్వకుంటే ఎంత? ప్రచారం ఇలాగ కూడా సాధించుకోవచ్చేమో?

లాక్ డౌన్ ఎత్తేస్తున్నారా ?