బాబు కన్నా బాలయ్య బెటర్ నే

లేటు అయినా ఘాటు ఫిగర్ నే అనౌన్స్ చేసారు బాలయ్య బాబు కరోనా సాయం కింద. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెరో యాభై లక్షలు, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కి పాతిక లక్షలు అందించారు.…

లేటు అయినా ఘాటు ఫిగర్ నే అనౌన్స్ చేసారు బాలయ్య బాబు కరోనా సాయం కింద. ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెరో యాభై లక్షలు, చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ కి పాతిక లక్షలు అందించారు. ఇన్నాళ్లు ఇండస్ట్రీలో ఇదే టాక్. బాలయ్య ఏమీ పలకడం లేదేమిటి? విజయ్ దేవరకొండ మాటేమిటి? అని

ఇప్పుడు బాలయ్య అనౌన్స్ చేసేసారు. ఇక విజయ్ దేవరకొండనే మిగిలారు. సరే, ఆ సంగతి అలా వుంచితే కేబినెట్ ర్యాంక్ తో వుండి, ప్రతిపక్షనాయకుడిగా వున్న చంద్రబాబు కన్నా ఎమ్మెల్యేగా వున్న బాలయ్యనే గట్టి డొనేషన్ అందించారు. చంద్రబాబు కేవలం పదిలక్షలు మాత్రమే అందించారు. 

బాలయ్య సినిమా హీరో కదా? సంపాదన ఎక్కువ అని ఎవరైనా అనేయచ్చు. కానీ హెరిటేజ్ కంపెనీ స్థాపకుడు ఆయనే. ఇప్పుడు ఎవరి పేరున టెక్నికల్ గా ఎలా వున్నా, అది చంద్రబాబు గారి స్వార్జితం. అలాగే ఆయన మాజీ ముఖ్యమంత్రి. ఆయన పేరిట, ఆయన భార్య పేరిట, ఆయన కుమారుడి పేరిట, ఆఖరికి మనవడి పేరిట ఏ మేరకు వందల కోట్ల ఆస్తులు వున్నాయో తెలిసిందే. 

మరి రాజకీయాల్లో వుంటూ , ప్రజల దృష్టిలో మరింత ఉన్నంతంగా నిలవాల్సిన తరుణంలో  చంద్రబాబు తక్కువ డొనేషన్ ఇవ్వడం ఆయన కన్నా ఆయన తమ్ముడి కుమారుడు నారా రోహిత్ ముఫై లక్షలు ఇవ్వడం కాస్త ఆశ్చర్య కరమే.

లాక్ డౌన్ ఎత్తేస్తున్నారా ?