cloudfront

Advertisement

Advertisement


Home > Movies - Movie News

సినిమా వర్కర్లకు సంపత్ నంది సాయం

సినిమా వర్కర్లకు సంపత్ నంది సాయం

కరోనా కారణంగా పనులు లేక ఇబ్బంది పడుతున్న సినిమా కార్మికుల కోసం మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో స్టార్ట్ చేసిన ఫండ్ కు దర్శకుడు సంపత్ నంది అయిదు లక్షలు విరాళం ప్రకటించారు. తన వంతు సామాజిక బాథ్యతగా ఈ విరాళాన్ని ఉడతా భక్తిగా తాను అందిస్తున్నట్లు ఆయన తెలిపారు.

సినిమా రంగ ప్రముఖుల అంతా కలిసి, మెగాస్టార్ ఆధ్వర్యంలో ముందుకు వచ్చి, సిసిసి ఫండ్ ను ఏర్పాటు చేసి, కార్మికులను ఆదుకునే ప్రయత్నం చేయడం బాగుందని, అందుకే ఈ విషయంలో తాను చేయగలిగిన మేరకు చేసే ప్రయత్నం చేసానని ఆయన అన్నారు.

సంపత్ నంది ప్రస్తుతం ఓ పెద్ద సినిమా చేస్తున్నారు. గోపీచంద్ హీరోగా సీటీమార్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా దాదాపు మూడు వంతులకు పైగా పూర్తయింది. తమన్నా కథానాయిక.  గతంలో యు టర్న్ సినిమాను నిర్మించిన చిట్టూరి శ్రీనివాసరావు నిర్మాత.

లాక్ డౌన్ ఎత్తేస్తున్నారా ?