Advertisement

Advertisement


Home > Movies - Movie News

ఈ ప్రజల్లో మార్పు రాదా.. హాట్ యాంకర్ ఆవేదన!

ఈ ప్రజల్లో మార్పు రాదా.. హాట్ యాంకర్ ఆవేదన!

కరోనా వైరస్ ఓ వైపు వీర విహారం చేస్తోంది. దానికి వాడూ వీడూ అన్న తేడా లేదు. కాలు కదిపితే కాటేస్తుందంతే. మరో వైపు మీ కోసం, మీ వారి కోసం బుద్ధిగా ఇంట్లో ఉండండి అంటూ ప్రభుత్వాలు ఒక వైపు అలుపెరగకుండా పిలుపు ఇస్తూనే ఉన్నాయి. కానీ మన వాళ్ళకు మాత్రం బుర్రలకు ఎక్కడంలేదు.

నాకేం కాదు, కరోనా కంటే కరోడాని నేను అనుకుంటూ ఇష్టం వచ్చినట్లుగా తిరిగేస్తున్నారు. ఇక లాక్ డౌన్ టైంలో నిత్యావసరాల కోసం కొన్ని గంటల పాటు ఇస్తున్న సడలింపునుని యువత సహా చాలా మంది రిలాక్స్ గా ఉపయోగించుకుంటున్నారు.

అనవసరంగా బయటకు వచ్చిన్ నలుగురిని పోగేసుకుని ముచ్చట్లు పెడుతున్నారు. విశాఖ లాంటి స్మార్ట్ సిటీలో అయితే ఉదయం  వేళల్లో బైకుల మోత, కార్ల గోల అంతా ఇంతా కాదు,

కానీ పొద్దల్లా పట్టిన మడిని చివరకిలా  పాడుచేస్తున్నారని, అందరినీ  కలిపేసి కరోనా వ్యాప్తికి కారణమవుతున్నారని వైద్య నిపుణులూ చెబుతున్నారు. అవసరం లేకపోతే ఇంటిపట్టునే  ఉండు, పని ఉంటే పది నిముషాల్లో పూర్తి చేసుకో. ఇదీ పోలీసులు చెబుతున్నది. మన కుర్ర కారు పాటిస్తే కదా.

అటువంటి వారికి ఎవరి చేత చెప్పించాలో వారి చేతే  ఇపుడు చెప్పిస్తున్నారు. బుల్లి తెర హాట్ యాంకర్ రష్మీ గౌతం విశాఖ సిటీ యూత్ కి తనదైన క్లాస్ తీసుకున్నారు. మన వూరు మంచిది. అంతా సౌమ్యులు, పని లేకుండా తిరిగి యూత్ కరోనాని తెచ్చి అంటిస్తే మొత్తం స్మార్ట్ సిటీ ఇబ్బందులు పడుతుంది. లాక్ డౌన్ అంటే నరకం కాదు, మన భవిష్యత్తు, మన వారికి ఆరోగ్యం, ఇది గుర్తుపెట్టుకుని ఇంట్లోనే ఉండండని రష్మీ పీకిన క్లాస్ అయినా విశాఖ సహా దేశంలోని యూత్ బుర్రలకు ఎక్కితే అదే పదివేలు.

లాక్ డౌన్ ఎత్తేస్తున్నారా ?

తమన్నా చిన్నప్పుడు ఎంత క్యూట్ గా ఉందో చూడండి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?