దర్శకుడు వివి వినాయక్ రీమేక్ ల స్పెషలిస్ట్. ఆ సంగతి ఇప్పటికే అనేక సార్లు ప్రూవ్ అయింది. లేటెస్ట్ మరో రీమేక్ ఆయన ఖాతాలోకి వచ్చినట్లు తెలుస్తోంది. తమిళ సినిమా కర్నన్ ను రీమేక్ చేసే బాధ్యత వివి వినాయక్ మీద నిర్మాత బెల్లంకొండ పెట్టినట్లు ఇండస్ట్రీ వర్గాల బోగట్టా.
ఈ సినిమాను బెల్లంకొండ శ్రీనివాస్ తో నిర్మించాలని హక్కులు కొని వుంచారు. ఇప్పుడు ఈ సినిమా రీమేక్ బాధ్యతలను డైరక్టర్ వివి వినాయక్ కు అప్పగించినట్లు తెలుస్తోంది.
కానీ ఇక్కడ చిన్న సందేహం ఏమిటంటే ఇప్పటికే బెల్లంకొండ హీరోతో ఛత్రపతి సినిమాను హిందీలో రీమేక్ చేసే పని వివి వినాయక్ చేపట్టారు. మరి ఆ సినిమా తో పాటు ఈ సినిమా కూడా చేస్తారా? లేక ఛత్రపతి రీమేక్ ను తాత్కాలికంగా పక్కన పెట్టి, కర్నర్ రీమేక్ చేస్తారా? అన్న క్లారిటీ ఇంకా రావాల్సి వుంది.
బెల్లంకొండ శ్రీనివాస్ చేతిలో ప్రస్తుతం తెలుగు సినిమా ఏదీ లేదు. అందువల్ల కర్నన్ రీమేక్ ను ముందుగా చేసి, ఆ తరువాత ఛత్రపతి చేస్తారో, లేదా రెండూ సమాంతరంగా చేస్తారో? ఇంకా క్లారిటీ రావాల్సి వుంది.