క‌రోనా బారిన ప‌డ్డ అంద‌గ‌త్తె

అంద‌గ‌త్తె మ‌హ‌మ్మారైన క‌రోనా బారిన ప‌డ్డారు. క‌రోనా నాలుగో వేవ్ ఉంటుంద‌ని భ‌యాందోళ‌న‌లు రేకెత్తుతున్న త‌రుణంలో ప‌లువురు సెల‌బ్రిటీలు ఆ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ఆవ‌శ్య‌క‌తపై…

అంద‌గ‌త్తె మ‌హ‌మ్మారైన క‌రోనా బారిన ప‌డ్డారు. క‌రోనా నాలుగో వేవ్ ఉంటుంద‌ని భ‌యాందోళ‌న‌లు రేకెత్తుతున్న త‌రుణంలో ప‌లువురు సెల‌బ్రిటీలు ఆ మ‌హ‌మ్మారి బారిన ప‌డ‌డం చ‌ర్చ‌నీయాంశ‌మైంది. దీంతో ప్ర‌తి ఒక్క‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన ఆవ‌శ్య‌క‌తపై చ‌ర్చ జ‌రుగుతోంది.

బ్యూటిఫుల్ యాక్ట‌ర్ వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ క‌రోనా బారిన ప‌డ‌డంతో మ‌హ‌మ్మారి మ‌రోసారి అంద‌రినోట నానుతోంది. క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోగా కోవిడ్ పాజిటివ్ అని తేలింద‌ని ఆదివారం ఆమె సోష‌ల్ మీడియా వేదిక‌గా విడుద‌ల చేసిన వీడియో ద్వారా వెల్ల‌డించారు. 

కోవిడ్ ఇంకా మ‌న‌ల్ని వ‌ద‌ల్లేద‌ని, కావున అంద‌రూ మాస్క్‌లు ధ‌రించి జాగ్ర‌త్త‌గా వుండాల‌ని వ‌ర‌ల‌క్ష్మి సూచించారు. అన్ని ర‌కాల జాగ్ర‌త్త‌లు పాటించిన‌ప్ప‌టికీ క‌రోనా నుంచి త‌ప్పించుకోలేక పోయిన‌ట్టు తాను విడుద‌ల చేసిన వీడియోలో వ‌ర‌ల‌క్ష్మి తెలిపారు.

ఇటీవ‌ల త‌న‌ను క‌లిసిన వారంతా వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని ఆమె విన్న‌వించారు. షూటింగ్ స‌మ‌యంలో ప్ర‌తి ఒక్క‌రూ మాస్క్‌లు ధ‌రించేలా ప‌ట్టుబ‌ట్టాల‌ని ఆమె చెప్పుకొచ్చారు. వ‌ర‌ల‌క్ష్మి త్వ‌ర‌గా కోలుకోవాల‌ని ఆమె అభిమానులు, శ్రేయోభి లాషులు ఆకాంక్షించారు. 

న‌టి రాధికా స్పంద‌న ఆక‌ర్షించింది. “జాగ్ర‌త్త వ‌రూ… నీకు మ‌రింత ధైర్యం, బ‌లం చేకూరాల‌ని ఆ దేవుడిని ప్రార్థిస్తున్నా” అని ఆమె రియాక్ట్ అయ్యారు. వ‌ర‌ల‌క్ష్మి త‌ల్లి విడాకులు ఇచ్చిన త‌ర్వాత తండ్రి శ‌ర‌త్‌కుమార్‌ను ప్ర‌ముఖ న‌టి రాధికా వివాహ‌మాడిన సంగ‌తి తెలిసిందే. వ‌ర‌ల‌క్ష్మికి రాధికా చిన్న‌మ్మ అవుతారు.