బోయపాటి మదిలో అఖండ-2

కథానాయకుడు..మహానాయకుడు అనే జంట పరాజయాలను చవిచూసిన హీరో బాలయ్యకు ఊపు నిచ్చిన సినిమా అఖండ. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ ల తరువాత వాటిని మించిన బ్లాక్ బస్టర్.  Advertisement…

కథానాయకుడు..మహానాయకుడు అనే జంట పరాజయాలను చవిచూసిన హీరో బాలయ్యకు ఊపు నిచ్చిన సినిమా అఖండ. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ లో సింహా, లెజెండ్ ల తరువాత వాటిని మించిన బ్లాక్ బస్టర్. 

బోయపాటికి కూడా వినయ విధేయ రామ సినిమా షాక్ నుంచి ఊరటతో పాటు ఊపు నిచ్చిన సినిమా. ఈ సినిమా తరువాత మళ్లీ ఆ ఇద్దరి కాంబినేషన్ మీద వార్తలు వున్నాయి.

రాబోయే ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీకి ఉపయోగపడేలా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ సినిమా ను బోయపాటి తీస్తారని వార్తలు వినిపిస్తూ వస్తున్నాయి. దీని బ్యానర్ ఇంకా డిసైడ్ కాలేదు. 

ప్రస్తుతం బోయపాటి వేరే సినిమా పనిలో వున్నారు. హీరో రామ్ తో సినిమా చేస్తున్నారు. బాలయ్య కూడా జై బాలయ్య, అలాగే అనిల్ రావిపూడి సినిమాలు పూర్తి చేయాల్సి వుంది.

ఇదిలా వుంటే బాలయ్యతో చేయబోయే పొలిటికల్ టచ్ సినిమాకు సీక్వెల్ టచ్ కూడా ఇస్తే ఎలా వుంటుంది అనే ఆలోచన బోయపాటి చేస్తున్నట్లు గ్యాసిప్ వినిపిస్తోంది. అఖండ సినిమాకు సీక్వెల్ ప్లాన్ చేస్తున్నారని బోగట్టా. అయితే ఇది వేరుగా చేస్తారా? లేక దీనికెే పొలిటికల్ టచ్ ఇస్తారా అన్నది ఇంకా తెలియదు. 

టూ ఎర్లీ స్టేజ్ లో వున్న ఈ సీక్వెల్ ఆలోచన బాలయ్య ఫ్యాన్స్ కు అయితే ఆసక్తిగా వుంటుందన్నది మాత్రం వాస్తవం.