గత కొన్నాళ్లుగా ప్రేమ పక్షులుగా విహరిస్తున్న మలైకా ఆరోరా, అర్జున్ కపూర్ లు పెళ్లికి రెడీ అయినట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ ప్రేమ జంట చర్చి వెడ్డింగ్ చేసుకోబోతోందట. అందుకు ముహూర్తం కూడా కుదిరిందని బాలీవుడ్ మీడియా చెబుతూ ఉంది. ఏప్రిల్ 19న వీరి వివాహం అని వార్తలు వస్తూ ఉన్నాయి.
మలైకా-అర్జున్ కపూర్ ప్రేమకథ గురించి కొత్తగా చెప్పడానికి ఏమీలేదు. ఏజ్ గ్యాప్ భారీగా ఉన్నా.. వీరి ప్రేమ మాత్రం చాలా ఘాటుగా సాగుతూ వచ్చింది. సల్మాన్ ఖాన్ తమ్ముడితో మలైక వివాహ బంధంలో ఉండగానే.. అర్జున్ కపూర్ ఆమెను తగులుకున్నాడనే వార్తలు వచ్చాయి. వారిద్దరి మధ్యన ప్రేమబంధం ఉందని అప్పట్లోనే గాసిప్స్ గుప్పుమన్నాయి.
అప్పటికే భర్తతో విడిపడి వేరుగా ఉంటూ వచ్చింది మలైక. విడాకులు కాకుండానే అలా తనకన్నా చాలా చిన్నవాడిని తిప్పుకుంటోందని మలైకా విషయంలో చాలా రూమర్లు వినిపించాయి. చివరకు అర్బాజ్ ఖాన్ తో మలైక విడాకుల తంతు పూర్తి అయ్యింది.
చాలా సంవత్సరాల వివాహబంధాన్ని వారు తెంచుకున్నారు. ఇక అప్పటి నుంచి మలైక- అర్జున్ లు డేర్ గా కలిసి తిరగడం ఆరంభించారు. వీరి బంధం మీద రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంతలోనే వీరి పెళ్లి ఫిక్స్ అయ్యిందనే మాట వినిపిస్తూ ఉంది. ప్రస్తుతం మలైకా వయసు 45 సంవత్సరాలు. అర్జున్ కపూర్ వయసు 33 సంవత్సరాలు. మలైకాకు అర్బాజ్ ఖాన్ తో సంతానం కూడా కలిగింది.