తమలపాకుతో ఒకటి అంటే తలుపు చెక్కతో ఒకటి అంటారు. అది కామన్. మాట విసిరే ముందే జాగ్రత్త పడాలి. పాపం, ఎప్పటి నుంచో సినిమా అన్నది చేతిలోలేకుండా వున్న రైటర్ చిన్నికృష్ణ ఒక్కసారిగా మెగా హీరోల మీద విరుచుకుపడ్టాడు. కానీ చిన్నకృష్ణ మీద అది భయంకరంగా బౌన్స్ బ్యాక్ అయినట్లు కనిపిస్తోంది.
చిన్నకృష్ణ చరిత్ర అంతా తవ్విపోస్తున్నారు మెగాభిమానులు. ఈ కోరస్ లో తనగొంతు కూడా కలిపాడు ఆకులశివ. చిరకాలంగా వివి వినాయక్ కు నమ్మిన సహచరుడిగా వుంటున్న ఆకుల శివ, సూటిగా, సుత్తి లేకుండా చిన్నకృష్ణను ఉతికి ఆరేసాడు. జనాలను ఉద్దేశించి ఆకుల శివ నేరుగా మాట్లాడిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది.
చిన్నకృష్ణ మెగా హీరోల పర్సనల్ వ్యవహారాల జోలికి వెళ్లాడని, అందుకే తాను కూడా పర్సనల్స్ టచ్ చేస్తున్నా అని చెప్పేసాడు. చిన్నకృష్ణ నైజం తెలిసినవారు ఎవ్వరూ అతన్ని ఇంటికి భోజనానికి పిలవరని, ఎవరో ఎందుకు తానే పిలవనని చెప్పేసాడు. ఇప్పడు కేవలం ఇన్ డైరక్ట్ గా మాట్లాడుతున్నా అని, చిన్నకృష్ణ నోరు మరోసారి విప్పితే, అతని చరిత్ర మొత్తం బయటపెడతా అని హెచ్చరించాడు.
మొత్తంమీద చిన్నికృష్ణ మీద మెగా హీరోలు చాలా స్మూత్ గా శివద్వారా అటాక్ చేయించి, నోరు మూయించే కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేసినట్లు కనిపిస్తోంది.