క్రిష్ మళ్లీ కేరాఫ్ బాలీవుడ్?

దర్శకుడు క్రిష్ ఏం చేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు ఆయన. కంగనతో వివాదం, అంతరిక్షం ఆర్థిక నష్టం, ఇవన్నీ ఒకేసారి చుట్టుముట్టాయి క్రిష్ ను. వాటన్నింటిని పక్కనపెట్టి  ప్రస్తుతం కొత్త…

దర్శకుడు క్రిష్ ఏం చేస్తున్నారు. ఎన్టీఆర్ బయోపిక్ పరాభవం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్నారు ఆయన. కంగనతో వివాదం, అంతరిక్షం ఆర్థిక నష్టం, ఇవన్నీ ఒకేసారి చుట్టుముట్టాయి క్రిష్ ను. వాటన్నింటిని పక్కనపెట్టి  ప్రస్తుతం కొత్త ప్రాజెక్టు మీద ఫుల్ బిజీగా వున్నారట క్రిష్. ప్రస్తుతానికి ముంబాయిలో ఓ నిర్మాతతో అన్నీ సెట్ అయి కథ ఓకే అయిందని, సరైన కాస్టింగ్ కోసం క్రిష్ చూస్తున్నారని తెలుస్తోంది.

తెలుగులో క్రిష్ సినిమా చేసే పరిస్థితి ఇప్పట్లో కనిపించడం లేదు. అయితే ఇప్పుడు కాకున్నా కొన్నాళ్ల తరువాత అయినా బన్నీతో సినిమా చేయాలనే ఆలోచనలో వున్నారు క్రిష్. అయితే బన్నీ ఎప్పుడు డేట్ లు ఇస్తాడు అన్నదాని మీద ఆధారపడి వుంది ఆ సినిమా.

అందుకే ఈలోగా బాలీవుడ్ లో సినిమా చేయాలనే ప్రయత్నాల్లో వున్నాడు క్రిష్. కంగన కారణంగా బాలీవుడ్ లో పొగొట్టుకున్న పరువును ముందు రికవరీ చేసుకునే ఆలోచనలో వున్నాడు ఆయన.

బాబు పాలన కమ్మజనరంజకంగా సాగుతోందా..?