ఆ సినిమా రెమ్యూనిరేషన్లే 75 కోట్లు

ఓ పెద్ద సినిమా నిర్మాణానికి నూరు నుంచి 125 నుంచి 150 కోట్లు ఖర్చువుతోంది. రెండు వందల కోట్ల మార్కెట్ వుంటే సర్లే అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆచార్య లాంటి దారుణ ఫ్లాప్ చూసిన…

ఓ పెద్ద సినిమా నిర్మాణానికి నూరు నుంచి 125 నుంచి 150 కోట్లు ఖర్చువుతోంది. రెండు వందల కోట్ల మార్కెట్ వుంటే సర్లే అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆచార్య లాంటి దారుణ ఫ్లాప్ చూసిన తరువాత కూడా ధైర్యంగా ఖర్చు చేస్తున్నారు అంటే గ్రేట్ నే. 

మైత్రీ నిర్మిస్తున్న మెగామూవీ వాల్తేర్ వీరయ్య సినిమాకు రెమ్యూనిరేషన్లే 75 కోట్ల వరకు అవుతున్నాయని ఇండస్ట్రీలో వినిపిస్తోంది.

ఈ సినిమా లో మెగాస్టార్ హీరో. ఆయన రెమ్యూనిరేషన్ ఎలా లేదన్నా 40 కోట్ల పై మాటే. రవితేజ కు18 కోట్లు అని టాక్ వుంది. డైరక్టర్ బాబీ. తక్కువలో తక్కువ 5 నుంచి ఆరు కోట్లు. కథ సహకారం ఇచ్చిన కోన వెంకట్, మిగిలిన నటులు, హీరోయిన్లు. సినిమాటోగ్రాఫర్, మ్యూజిక్ డైరక్టర్ అన్నీ కలిపి 75 కోట్లు దాటేస్తోందని టాక్.

సినిమాకు కనీసం 100 రోజులు వర్కింగ్ డేస్ వుంటాయి. ఆ ఖర్చు. వడ్డీలు, పబ్లిసిటీ అన్నీ కలిపి 125 కోట్లు దాటేస్తుందని అంచనా వేస్తున్నారు. ఇలా చేస్తే ఆచార్య సినిమాకు 40 కోట్ల నష్టాలు మూట కట్టుకున్నారు. అది తెలిసీ మైత్రీ మూవీస్ జాగ్రత్తగా వుండడం లేదని కామెంట్లు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.