టాలీవుడ్ నిర్మాతలు సినిమా నిర్మాణం బంద్ మీద డిస్కషన్లు సాగిస్తున్నారు. కేవలం హీరోల రెమ్యూనిరేషన్ ల మీద మాత్రమే కాకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల రెమ్యూనిరేషన్ మీద దృష్టి సారిస్తున్నారు.
సినిమా పాడయితే హీరో కి, నిర్మాతకు, దర్శకుడికి ఇబ్బంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు వచ్చిన నష్టం లేదు. టాలీవుడ్ లో కీలకమైన క్యారెక్టర్ ఆర్టిస్ట్ ల డిమాండ్లు మామూలుగా లేదు.
ఫుల్ డిమాండ్ లో వున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒకరు తన డైలీ రెమ్యూనిరేషన్ అయిదు లక్షలకు పెంచేసారు. అది కాక రెండు కార్లు పెట్టాలి. అలా అని సాయంత్రం అయిదు దాటితే సెట్ లో వుండరు.
పక్క భాష నుంచి ఇక్కడకు వచ్చి పేరు తెచ్చుకున్న క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఒకరు రోజుకు మూడు లక్షలకు తన రెమ్యూనిరేషన్ పెంచేసారు.
లీడింగ్ కమెడియన్లు కూడా ఇదే మాదిరిగా వున్నారు. రోజుకు రెండు నుంచి నాలుగు లక్షలు వసూలు చేస్తున్నారు. అందుకే వాళ్ల సీన్లు వీలయినంత తగ్గించి, సినిమాలో వున్నారు అని అనిపించేస్తున్నారు.
ఒక్కో సినిమాకు ప్రధాన క్యారెక్టర్ ఆర్టిస్ట్ లకు దాదాపు ఇరవై నుంచి అరవై రోజుల వర్క్ వుంటుంది. అంటే దాదాపు కోటి నుంచి రెండు కోట్లు ఖర్చు. పక్క భాషల నుంచి వేరే నటులను తెచ్చుకోవడానికి రీజన్ కూడా ఇదే.
పక్క భాషల నుంచి కీలకమైన వారిని తీసుకువస్తే మహా అయితే కోటి రూపాయలు వుంటుంది మొదటిసారికి. ఆ డబ్బులు నాన్ థియేటర్ మీద రావడానికి కూడా అవకాశం వుంది.
అందుకే గిల్డ్ నిర్మాతలు ఇప్పుడు వీటి మీద కూడా దృష్టి పెడుతున్నారు. భారీగా రేట్లు పెంచిన క్యారెక్టర్ ఆర్టిస్టులను మెలమెల్లగా పక్కన పెట్టాలని ఆలోచిస్తున్నారు.