గత కొన్నేళ్లుగా సినిమాలను పెద్దగా సీరియస్ గా తీసుకోకుండా.. జీవితాన్ని ఆస్వాదిస్తున్నట్టుగా కనిపించే ఇలియానా మరోసారి ప్రేమలో పడిందని టాక్.
ఇది వరకూ ఇలియానా ఒక విదేశీయుడితో ప్రేమకథను నడిపించింది. అతడితో చాలా కాలమే సహజీవనం గట్రా చేసినట్టుగా ఉంది. ఒక దశలో ఇలియానా ప్రెగ్నెంట్ అనే ఊహాగానాలూ వినిపించాయి. వారిద్దరూ ఎంగేజ్ మెంట్ చేసుకున్నారని, పెళ్లే తరువాయి అనే వార్తలూ వచ్చాయి.
అంతకన్నా మునుపు తను ఒక తెలుగు సినిమా హీరోతో ప్రేమలో పడినట్టుగా కూడా ఇలియానా ఇంటర్వ్యూల్లో చెప్పింది. అయితే ఆ ప్రేమ ప్రకటన అతడితో బ్రేకప్ తర్వాతే చేసింది ఈ గోవా భామ.
ఇలా ఇలియానా ఖాతాలో ప్రేమకథలకు లోటు లేదు. అయితే తనెంతగానో ప్రేమించిన ప్రియుడితో ఆమె బ్రేకప్ చేసుకుంది. బాలీవుడ్ లో ఇలియానాకు అడపాదడపా ఆఫర్లకు లోటు లేదు. ఈ నేపథ్యంలో ఆమెకు బాలీవుడ్ లో పరిచయాలు కూడా బాగానే ఉన్నట్టున్నాయి.
ఈ క్రమంలో ఇలియానా మరోసారి ప్రేమలో పడిందని టాక్. అది కూడా కాస్త సినిమాలతో సంబంధం ఉన్న వాడితోనే. అతడు మరెవరో కాదు బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినాకైఫ్ సోదరుడు. కత్రినా హీరోయిన్ గా సక్సెస్ అయిన తర్వాత ఆమె సోదరి, సోదరుడు కూడా కాస్తోకూస్తో గుర్తింపును పొందారు.
కత్రినా చెల్లెలు ఇసబెల్ హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుందనే టాక్ కూడా అప్పట్లో వచ్చింది. ఇసబెల్ తో పోలిస్తే వీరి సోదరుడు సెబాస్టియన్ మరింత లోప్రొఫైల్ లో ఉంటాడు.
ఇతడే ఇలియానా మనసుకు నచ్చాడని.. వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నట్టుగా భోగట్టా. తాజాగా ఇన్ స్టా లో వీరంతా జాయింటుగా ఉన్న ఫొటోను కూడా షేర్ చేశారు. ఈ సాన్నిహిత్యం వెనుక ఇలియానా- సెబాస్టియన్ ల ప్రేమ కహానీ ఉందనేది బీ టౌన్ టాక్.