ఇపుడు లాక్ డౌన్ పేరిట అంతా ఇళ్ళకే పరిమితం అయ్యారు. బయటకు వస్తే లాఠీ దెబ్బలే. దాంతో తప్పనిసరిగా ఇళ్ళలోనే ఉండాల్సిన అవసరం వచ్చిపడింది.
సరిగ్గా ఈ సమయంలో కొన్నేళ్ళుగా జైళ్ళలో మగ్గుతున్న వారు ఇపుడు బయట వెలుతురుని చూసి గాలిని స్వేచ్చగా పీల్చే అవకాశం లభించింది. కరోనా వైరస్ అలా వారిని జైలు ఊచల నుంచి బయటపడేసింది.
విశాఖ జిల్లాలో ఈ విధంగా కరోనా ప్రభావం కారణంగా జైళ్ళలో రద్దీని తగ్గించేందుకు సుప్రీం కోర్టు, హై కోర్టు ఆదేశాల మేరకు 74 మందిని ఒకేసారి విడుదల చేశారు. ఇందులో ఏడుగురు మహిళలు కూడా ఉన్నారు.
మొత్తానికి కరోనా వైరస్ పుణ్యమాని చాలా తొందరగానే బయట ప్రపంచంలోకి అడుగుపెట్టామని ఈ ఖైదీలు సంబరపడుతునారు. వారికి లాక్ డౌన్ లో స్వేచ్చ దొరికింది, కానీ అదే లాక్ డౌన్ లో ఇంటికో పది మంది ఖైదీలు తయారైన వేళ వారికి అది స్వేచ్చ అనుకోవాలో, ఇంటికెళ్ళి మళ్ళీ ఖైదు అవుతామనుకోవాలో అర్ధం కాని పరిస్థితే.