జగన్ సర్కార్ పరువు తీస్తున్న అతి ఉత్సాహం…

దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా కొందరి అధికారుల వైఖరి ఉంది. దాంతో ప్రజల మన్ననలు పొందుతూ సాఫీగా సాగుతున్న జగన్ సర్కార్ మీద కోరి నిందలు వేయిస్తున్నారా అన్న చర్చ అయితే ఉంది.  Advertisement…

దున్నపోతు ఈనిందంటే దూడను కట్టేయమన్నట్లుగా కొందరి అధికారుల వైఖరి ఉంది. దాంతో ప్రజల మన్ననలు పొందుతూ సాఫీగా సాగుతున్న జగన్ సర్కార్ మీద కోరి నిందలు వేయిస్తున్నారా అన్న చర్చ అయితే ఉంది. 

విశాఖ తూర్పు నియోజకవర్గంలో బధిరుల స్కూల్ ను ఈ కరోనా టైమ్ లో కూల్చడం ఏంటి అన్నది ఇపుడు విపక్షాలు సంధిస్తున్న ప్రశ్న. నిజానికి ఇపుడు ఏ స్కూలు కూడా నిర్వహించడంలేదు. పైగా అక్కడ యాజమాన్యం కూడా ఎక్కడికీ పారిపోయేది కాదు.

కానీ గునపం తెచ్చి హఠాత్తుగా కూల్చుడే అన్నట్లుగా జీవీఎంసీ అధికారులు చేసిన అతికి వైసీపీ సర్కార్ ఇపుడు బదనాం అవుతోంది. నిజానికి రెండువేల గజాల ఆ స్థలం జీవీఎంసీకి చెందినది. దాన్ని కేవలం సేవాభావంతో నామమాత్రపు రుసుం తో వాడుకోవడానికి జీవీఎంసీ ఎనిమిదేళ్ల క్రితం మంజూరు చేసింది.

అయితే ఆ స్కూల్ యజమాని స్కూల్ నడుపుకునేందుకు ఇచ్చిన స్థలంలో వేరే అవసరాల కొరకు నిర్మాణం చేస్తున్నారు అన్నది జీవీఎంసీ అభియోగం. సరే ఈ విషయాలు ఎలా ఉన్నా అక్కడ 190 మందికి పైగా దివ్యాంగులు చదువుకుంటున్నారు. అది ఉత్తమమైన విషయం. కాబట్టి దానిని దృష్టిలో ఉంచుకుని సాఫీగా వ్యవహరించాల్సి ఉంటే ఇంత గొడవ జరిగేది కాదు అన్నది అధికార పార్టీలో కూడా వినిపిస్తున్న మాట.

హడావుడిగా వచ్చి అక్కడి షెడ్లు కూల్చివేయడం వల్ల చెడ్డ పేరు ప్రభుత్వానికి వచ్చినట్లు అయింది. ఇదంతా అధికారులు అతి ఉత్సాహంలో చేశారనే చెప్పాలి.  దీన్ని కూడా ఒక సెక్షన్ ఆఫ్ మీడియా హైలెట్ చేసింది. ఇపుడు చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందాన వేరే చోట స్కూల్ కి స్థలం ఇస్తామని అధికారులు అంటున్నారు. 

ఆ పనేదో ముందే చేస్తే ఈ గొడవ అయ్యేది కాదుగా. మరి ఇలాంటి దూకుడు అధికారులు ఉంటే విశాఖ వంటి చోట్ల అధికార పార్టీని విపక్షాలు ఏమీ కాకుండానే మూడు చెరువుల నీళ్ళు తాగిస్తారు అనుకోవాల్సిందేగా.