హీరో బాలకృష్ణతో మైత్రీ సంస్థ నిర్మించే సినిమా అప్ డేట్ రేపు అంటూ అనౌన్స్ మెంట్ వచ్చింది కానీ కొద్ది సేపటికే ఆ పోస్టర్ కాస్తా లీక్ అయిపోయింది.
బాలయ్య దగ్గర వుండే వ్యక్తి దాన్ని ఫ్యాన్స్ గ్రూపులో ముందుగా వేయడంతో, అది కాస్తా సోషల్ మీడియాలోకి వచ్చేసినట్లు తెలుస్తోంది.
కానీ అలా అని పోస్టర్ లో ఏమన్నా వుందా అంటే అదీ లేదు. బాలయ్య బర్త్ డే పోస్టర్ లో ఆయన ఫొటో లేకపోవడం స్పెషాలిటీ అనుకోవాలి.
బాలయ్య పిక్ బదులు సింహం ఫొటో వేసి, వేట మొదలైంది అంటూ ఓ కొటేషన్ పడేసారు. బర్త్ డే కాబట్టి ఏదో ఒకటి వదలాలి అన్నట్లు వదిలినట్లుంది చూస్తుంటే.
ప్రస్తుతం బాలయ్య చేస్తున్న బోయపాటి సినిమా పూర్తి కావాలి. ఆ తరువాత ఈ సినిమా మీదకు వస్తారు. దీనికి దర్శకుడు గోపీచంద్ మలినేని.