టీడీపీ సీటు మీద జగన్ ఫోకస్…?

విశాఖ జిల్లా విభజన తరువాత కేవలం ఆరు అసెంబ్లీ సీట్లతో చిన్నగా మారిపోయింది. ఏపీలోనే చిన్న జిల్లాగా కూడా పేరు తెచ్చుకుంది. ఇందులో చూస్తే నాలుగింటిని 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుచుకుంది. దాంతో ఎక్కడ…

విశాఖ జిల్లా విభజన తరువాత కేవలం ఆరు అసెంబ్లీ సీట్లతో చిన్నగా మారిపోయింది. ఏపీలోనే చిన్న జిల్లాగా కూడా పేరు తెచ్చుకుంది. ఇందులో చూస్తే నాలుగింటిని 2019 ఎన్నికల్లో టీడీపీ గెలుచుకుంది. దాంతో ఎక్కడ ఎలా ఉన్నా విశాఖ జిల్లా మాత్రం టీడీపీకి స్ట్రాంగ్ హోల్డ్ అన్నట్లుగా ఉందిపుడు.

దీంతో వచ్చే ఎన్నికల్లో విశాఖ మీద వైసీపీ ఫుల్ ఫోకస్ పెట్టేసింది. విశాఖలో టీడీపీ గెలుచుకున్న సీట్లలో వైసీపీ తన అభ్యర్ధులను వరసబెట్టి ముందస్తుగా ప్రకటిస్తోంది. 

ఇప్పటికే సౌత్, వెస్ట్, నార్త్ లకు అభ్యర్ధులను డిసైడ్ చేసిన వైసీపీ తూర్పు నియోజకవర్గానికి కూడా క్యాండిడెంట్ ని సెట్ చేసింది.

జగన్ విశాఖ టూర్ అంతా తూర్పు నియోజకవరంలోనే సాగింది. దాంతో అక్కడ అభివృద్ధి పనులను పెద్ద ఎత్తున చేపట్టేందుకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. 

అంతే కాదు, తూర్పులో వైసీపీని ఇంచార్జిగా ఉన్న అక్రమాని విజయనిర్మలని అసలైన ఎమ్మెల్యేగా నిలబెట్టారు. ఆమె ప్రజా సమస్యలను సీఎం ముందు పెడితే అన్నింటికీ ఆయన ఓకే చేసి ఆమెను జనంలో ఆమె పేరు ప్రచారమయ్యేలా చేశారు.

ప్రస్తుతం వీఎమ్మార్డీయే చైర్మన్ గా ఉన్న విజయనిర్మల 2019 ఎన్నికలలో తూర్పు నుంచి పోటీ చేసి సిట్టింగ్ ఎమ్మెల్యే వెలగపూడి రామక్రిష్ణబాబుని ధీటుగా ఎదుర్కొన్నారు. 

వచ్చే ఎన్నికల్లో ఆయన్ని ఓడించేందుకు ఆమె ప్రయత్నం చేస్తున్నారు. దానికి దన్నుగా అండగా జగన్ నిలబడ్డారు. ఈసారి తూర్పులో మార్పు రావాల్సిందే అని వైసీపీ అధినేత గట్టిగా భావిస్తున్నారు.