బుర్రకు పదును పెట్టు బాబూ….

చంద్రబాబుని అపర చాణక్యుడు అంటారు. ఆయనంతటి మేధావి కూడా లేడు అని చెబుతారు. ఇక బాబు పద్నాలుగేళ్ల పాటు సీఎం గా పనిచేశారు. అటువంటి బాబు ఏపీలో అభివృద్ధి లేదంటున్నారు. రెండేళ్ళుగా ఏమీ జరగడంలేదు…

చంద్రబాబుని అపర చాణక్యుడు అంటారు. ఆయనంతటి మేధావి కూడా లేడు అని చెబుతారు. ఇక బాబు పద్నాలుగేళ్ల పాటు సీఎం గా పనిచేశారు. అటువంటి బాబు ఏపీలో అభివృద్ధి లేదంటున్నారు. రెండేళ్ళుగా ఏమీ జరగడంలేదు అని కూడా అంటున్నారు. నిజానికి ఏపీలో రెండేళ్ల పాటు వరసగా కరోనా మహమ్మారి ఉన్నా కూడా జనం చేతులలో కరెన్సీ కదలాడుతోంది.

ఒకటా రెండా ఎన్నెన్నో పధకాలు జగన్ ప్రభుత్వం అమలు చేస్తోంది. నేరుగా లబ్దిదారుల ఖాతాలోనే ఆ సొమ్ముని వేస్తోంది. దాంతో కరోనా కష్టకాలంలో కూడా జనంలో ఆర్ధిక భరోసా ఏర్పడుతోంది.

తలపండిన ఆర్ధిక నిపుణులు కూడా జనం చేతిలో డబ్బు ఉంటేనే ఆర్ధిక సంక్షోభాలు రావు అని అంటున్నారు. ఇలా ఏపీ అన్ని రకాలుగా జనాన్ని ఆదుకుంటూంటే విపక్షాలు అర్ధం లేని విమర్శలు చేయడం తగునా అంటున్నారు మంత్రి బొత్స సత్యనారాయణ.

ప్రభుత్వ పధకాల వల్లనే ప్రజలలో కొనుగోలు శక్తి పెరుగుతోందని, ఫలితంగా మార్కెట్లు కళకళలాడుతున్నాయని, ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతున్నాయని బొత్స అంటున్నారు. ఏపీలో అభివృద్ధిని ఆర్ధిక నిపుణులే మెచ్చుకుంటూంటే చంద్రబాబు ఆయన టీమ్ మాత్రం విమర్శించడం దారుణమని ఆయన అంటున్నారు. 

బాబు బుర్రకు పదును పెట్టి ఒక్కసారి ఆలోచన చేయండని కూడా బొత్స చెబుతున్నారు. మరి బాబుకు ఏపీ అభివృద్ధి కనిపిస్తుందా…