అరియానా గ్లోరీ…ఆర్జీవీని ఇంటర్వూ చేసి, సోషల్ మీడియాలో పాపులర్ యాంకర్ గా మారి, ఆపై బిగ్ బాస్ హవుస్ లో హల్ చల్ చేసి, మరింత పాపులారిటీ సంపాదించింది.
అలాంటి అరియానా ఈ మధ్యనే ట్విట్టర్ లో ఓ పిక్ పోస్ట్ చేసి మరోసారి ఆర్జీవీని ఇంటర్వూ చేసినట్లు తెలిపింది. ఆ పిక్ లో అరియానా జిమ్ డ్రెస్ లో ఆర్జీవీతో కలిసి కనిపించింది.
విశ్వసనీయ వర్గాల బోగట్టా ప్రకారం ఆర్జీవీ ప్రత్యేకించి తనతో ఓ ఇంటర్వ్యూ చేయమని అరియానా ను కోరినట్లు తెలుస్తోంది.పైగా ఆ ఇంటర్వ్యూకూడా డిఫరెంట్ గా యాంకర్-హోస్ట్ ఇద్దరూ జిమ్ లో జిమ్ చేస్తూ, క్వశ్చన్, ఆన్సర్లు కొనసాగేలాంటి కాన్సెప్ట్ ఏదో ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
ఇంటర్వ్యూ పూర్తయిందని, ఆర్జీవీనే దాని ఎడిటింగ్ బాధ్యత, ప్రోమో కటింగ్ బాధ్యత తీసుకుని పూర్తి చేసారని, ఆపై అరియానాను పిలిచి చూపించినట్లు తెలుస్తోంది. అయితే తను చేసి ఇంటర్వ్యూ చూసిన అరియానా, దీన్ని జనాలు ఎలా రిసీవ్ చేసుకుంటారో? అని సన్నిహితుల దగ్గర టెన్షన్ పడినట్లు తెలుస్తోంది.
తనన ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన యాంకర్ల లుక్స్ ను, ఫిజిక్ ను పొగడడం, వారిని బికినీలో చూడాలని వుంది, అలా చూడాలని వుంది, ఇలా చూడాలని వుంది అని అనడం ఆర్జీవీకి అలవాటే. అందువల్ల అరియానాను ఎలా చూపించారో ఆ ఇంటర్వ్యూ చూస్తే తప్ప తెలియదు.