ఎవరి మేధస్సు ఏంటో ఎవరూ చెప్పలేరు. ఇప్పటితరం ఆ విషయాన్ని తరచూ రుజువు చేస్తూనే ఉంది. ఇదిలా ఉంటే ఎక్కడో క్రిష్ణపట్నం ఆనందయ్య ఆయుర్వేదం మందు కరోనాకు ఇస్తున్నాడు అన్నది ఆ నోటా ఈ నోటా పాకి ఇపుడు ప్రపంచం మొత్తానికి తెలిసింది.
ఆ మందులో ఆనందయ్య వినియోగించే దినుసులను వీడియోలో కూడా పలుమార్లు ప్రదర్శించారు. వాటిని చూసిన విశాఖ జిల్లా చోడవరం నియోజకవర్గం అన్నవరానికి చెందిన పొట్నూరు హరనాధ్ అనే తొమ్మిదవ తరగతి చదివే బాలుడు చక్కగా తయారుచేసేశాడు.
ఈ బాలుడుకి కావాల్సిన మందులను స్థానికంగా ఉన్నవారు అందించారు. అలాగే ఆయుర్వేద వైద్యంలో అనుభవం ఉన్న పెద్ద వారు కొందరు సలహా ఇవ్వడంతో ఈ బాలుడు కరోనాకు విరుగుడు మందు కనుగొని అద్భుతమే సృష్టించారు.
తాటిబెల్లం, పిప్పళ్లు, అల్లం, గుంటకలవరాకు, నేల ఉసిరి, మిరియాలు, దాల్చిన చెక్క, పసుపు ఇతర దినుసులను ఉపయోగించి ఈ మందు తయారు చేసినట్లుగా హరనాధ్ చెప్పాడు.
దీన్ని జిల్లా ఆయుష్ అధికారులకు పంపించి వారి అనుమతి తీసుకున్న తరువాత కరోన రోగులకు పంపిణీ చేస్తామని నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తానికి అటు క్రిష్ణపట్నం నుంచి ఇటు విశాఖపట్నానికి కరోనా మందు వచ్చేసిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.