ఒ సినిమా , ఓ ప్యాట్రన్ హిట్ అయితే అదే పోకడం పోవడం అన్నది టాలీవుడ్ లో మామూలే. అర్జున్ రెడ్డి సినిమా జనాదరణ పొందడంతో మళ్లీ అదే ఫ్యాట్రన్ ను, అదే స్టయిల్ ఆఫ్ మేకింగ్ ను ట్రయ్ చేస్తున్నట్లుంది హీరో విజయ్ దేవరకొండతో నిర్మాతలు మైత్రీమూవీస్, కొత్త డైరక్టర్ భరత్ కమ్మ కలిసి. ఈ కాంబినేషన్ లో తయారవుతున్న డియర్ కామ్రేడ్ టీజర్ బయటకు వచ్చింది.
ఈ సినిమాలో విజయ్ విద్యార్థి సంఘ నాయకుడిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే హీరోయిన్ క్రికెటర్ గా కనిపిస్తుంది. ఇటు ప్రేమ, అటు విద్యార్థి సంఘ రాజకీయాలు కలిసిన నేపథ్యంలో సినిమా సాగుతుంది. టీజర్ లో ఈ విషయాన్నే క్లియర్ గా చెప్పే ప్రయత్నం చేసారు.
టీజర్ కట్ చేసిన విధానం బాగుంది. విద్యార్థుల గొడవ ను అలా ముందుకు తీసుకెళ్తూ, ప్రేమికుల సీన్ ను ఇన్ సెర్ట్ చేయడం బాగుంది. నేపథ్యంలో వచ్చిన గీతాలాపన బాగుంది. ఈ సినిమాలో రష్మిక మడొన్న కథనాయకురాలు.