చిత్రలహరి @ 25 కోట్లు

ఆరు వరుస ఫ్లాపుల్లో వున్న హీరోతో సినిమా చేయడమే గొప్ప. దాన్నిమళ్లీ 25 కోట్లకు పైగా మొత్తానికి మార్కెట్ చేయడం అంటే మరీ గొప్ప. ఆ ఫీట్ ను సాధించింది మైత్రీమూవీస్. కిషోర్ తిరుమల…

ఆరు వరుస ఫ్లాపుల్లో వున్న హీరోతో సినిమా చేయడమే గొప్ప. దాన్నిమళ్లీ 25 కోట్లకు పైగా మొత్తానికి మార్కెట్ చేయడం అంటే మరీ గొప్ప. ఆ ఫీట్ ను సాధించింది మైత్రీమూవీస్. కిషోర్ తిరుమల డైరక్షన్ లో సాయిధరమ్ తేజ్ హీరోగా చిత్రలహరి అంటూ సినిమా నిర్మించింది మైత్రీమూవీస్. 

నిర్మించడం అంటే నిర్మించారు. సేల్స్ సంగతేమిటి? అందుకే వెల్ ప్లాన్డ్ గా స్మూత్ గా మార్కెట్ చేసింది. బయ్యర్లతో మీటింగ్ పెట్టి ఆంధ్ర ఏరియా వాళ్లకు ఏ రేంజ్ లో అయితే కంఫర్డ్ నో అడిగి, ఆ రేంజ్ లోనే ఇచ్చేసారు. ఆరుకోట్లు రేంజ్ అయితేనే సాయిధరమ్ తేజ్ సినిమా తమకు కంఫర్ట్ అని ఆంధ్ర బయ్యర్లు అనడంతో ఆంధ్ర ఏరియా అంతకే ఇచ్చేసారు.

సీడెడ్ ను 1.70 కోట్లకు, నైజామ్ ను 3 కోట్లకు కాస్త తక్కువగా ఇచ్చేసారు. కర్ణాటకను 70లక్షలకు, రెస్టాఫ్ ఇండియా 20 లక్షలకు విక్రయించారు. ఆ విధంగా డొమెస్టిక్ మార్కెట్ నుంచి 11 కోట్లకు పైగా వసూలు చేసుకున్నారు. ఓవర్ సీస్ మార్కెట్ నుంచి కోటి అంచనా వేస్తున్నారు.

ఇదిలావుంటే శాటిలైట్ ను 4 కోట్లకు, డిజిటల్ ను 3 కోట్లకు, హిందీ డబ్బింగ్ వగైరాను అయిదు కోట్లకు, అడియోను కోటిన్నరకు ఇచ్చేసారు. ఆ విధంగా 13 కోట్లకు పైగా వచ్చింది. ఇలా మొత్తంమీద 25 కోట్లకు కాస్త ఎక్కువగానే ప్రీరిలీజ్ బిజినెస్ చేసారు.

ఇదిలావుంటే సినిమాకు 22 కోట్ల వరకు ఖర్చయినట్లు తెలుస్తోంది. ఇంకా పబ్లిసిటీ ఖర్చు వుండనే వుంది. ఈ సినిమా ఏప్రియల్ 12న విడుదల అవుతోంది. ఎన్నికలు అయిపోగానే వస్తున్న ఫస్ట్ సినిమా ఇదే. 

ఓటు మాయం.. ప్రజాస్వామ్యానికి వెన్నుపోటు 

మీ ఓటు ఉందో లేదో.. ఇలా నిర్ధారించుకోండి!