రాజకీయ చిత్రాలపై ఆసక్తి వున్నవారే కాదు, లేనివారు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా లక్ష్మీస్ ఎన్టీఆర్. ఈ సినిమా ఈనెల 22న విడుదలకు డేట్ అనౌన్స్ చేసి సిద్దంగా వుంది. కానీ విడుదల మాత్రం కావడంలేదు. వీలయితే, అన్ని అడ్డంకులు అధిగమిస్తే ఈనెల 29న విడుదల కావడానికి అవకాశం వుంది.
ఈ సినిమా విడుదల ఆపాలని తెలుగుదేశం పార్టీ జనాలు ఎలక్షన్ కమిషన్ ను ఆశ్రయించిన సంగతి తెలిసింది. అయితే ఇది తమ పరిథిలోది కాదని ఎన్నికల కమిషన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. అయితే సెన్సారు జనాలు మాత్రం ఇంకా ఈ సినిమా మీద ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు.
మొత్తం మీద 22న విడుదల కావడానికి మాత్రం సమయం లేదు. అది వాస్తవం. ఎందుకంటే ఇంకా కేవలం ఆరురోజులే సమయం వున్నందున సినిమా విడుదలకు సరిపోదు. ఇక తరువాయి తేదీ 29 మాత్రమే. లేదూ అంటే ఆ తేదీకి ఒకటి రెండు రోజులు ముందుగా… సెన్సారు అడ్డంకులను అధిగమించడానికి దర్శకుడు, నిర్మాత చాలా గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
ఈ సినిమాను ఎలాగైనా ప్రచారం మాంచి ఊపులో వుండగానే విడుదల చేయాలన్నది ఆర్జీవీ సంకల్పంగా వుంది. మరి ఆ సంకల్పం నెరవేరుతుందో లేదో చూడాలి.