జనసేన ఒంటరిగానే అన్ని స్థానాల్లో పోటీచేస్తుంది – ఇది ఆ పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ పదే పదే చెబుతున్న మాట. అయితే రాజకీయపార్టీల జనాల్లో మాత్రం అంతర్గతంగా వేరే విధంగా వినిపిస్తోంది. జనసేకు తెలుగుదేశం పార్టీతో ఓ అవగాహన కుదిరిపోయింది అన్నది రాజకీయ జనాల్లో బలంగా వినిపిస్తున్న గుసగుస.
ఇరుపార్టీల అధినేతల మధ్య కుదిరిన రహస్య అవగాహనపై రకరకాల వదంతులు వినిపిస్తున్నాయి. దాని ప్రకారం కొన్ని స్థానాల్లో కొంతమంది అభ్యుర్థులను తెలుగుదేశం పార్టీనే సూచిస్తుంది. వాళ్లకు జనసేన టికెట్ ఇస్తుంది. కొన్ని జనసేన స్థానాల్లో తెలుగుదేశం కాస్త వీక్ అభ్యర్థులను నిలబెడుతుంది. అలాగే కీలకనేతలు పవన్. తోట చంద్రశేఖర్, నాదెండ్ల మనోహనర్ తదితరులపై కూడా బలమైన అభ్యర్థిని నిలబెట్టదు.
అలాగే ఎన్నికల ప్రచారంలో పవన్ ఎక్కువగా జగన్ ను టార్గెట్ చేస్తూ ప్రసంగిస్తారు. పవన్ ఎక్కువగా కాపులకు సీట్లు ఇస్తారు. తెలుగుదేశం బిసిలకు సీట్లు ఇస్తుంది. అందువల్ల ఓట్లు చీలిపోకుండా కాపాడుకుని, ఎవరి ఓట్లు వారు తీసుకునే అవకాశం వుంటుంది. తెలుగుదేశాన్ని వీలయినంత తక్కువ విమర్శిస్తారు.
ఎన్నికల అనంతరం ఫలితాలను బట్టి జనసేన ప్రభుత్వంలో చేరడం.. పదవులను స్వీకరించడం వంటి వాటి మీద నిర్ణయాలు వుంటాయి. జనసేన కనుక కాస్త చెప్పుకోదగ్గ సంఖ్యలో స్థానాలు గెల్చుకుంటే, పవన్ కు కీలకపదవి వుండొచ్చు.